https://oktelugu.com/

‘ఆచార్య’లో మరో పవర్ ఫుల్ విలన్.. ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఎంతో సీక్రెట్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం పేరును పొరపాటున చిరంజీవి రిలీజ్ చేయడం దుమారం రేపింది. దీనిపై దర్శకుడు, చిత్ర బృందం షాక్ తిన్నది. తాజాగా రిలీజ్ అయిన ‘ఆచార్య’ ట్రైలర్ ఆకట్టుకుంది. Also Read: ప‌వ‌ర్ స్టార్ కోసం.. భాగ్యన‌గ‌రం మ‌ళ్లీ నిర్మి‌స్తున్నారు! ఒక దేవాలయం.. ఆ దేవాలయంపై ఆధారపడి అందరికోసం జీవించే జనాలను కబళించే […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2021 / 10:21 PM IST
    Follow us on

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఎంతో సీక్రెట్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం పేరును పొరపాటున చిరంజీవి రిలీజ్ చేయడం దుమారం రేపింది. దీనిపై దర్శకుడు, చిత్ర బృందం షాక్ తిన్నది. తాజాగా రిలీజ్ అయిన ‘ఆచార్య’ ట్రైలర్ ఆకట్టుకుంది.

    Also Read: ప‌వ‌ర్ స్టార్ కోసం.. భాగ్యన‌గ‌రం మ‌ళ్లీ నిర్మి‌స్తున్నారు!

    ఒక దేవాలయం.. ఆ దేవాలయంపై ఆధారపడి అందరికోసం జీవించే జనాలను కబళించే వారిపై పోరాడే ఒక ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ కనిపించనున్నారు. ‘ఆచార్య’ కథ రాష్ట్రంలోని దేవాలయాలు.. అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన కథ. ముఖ్యంగా అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే తెలుస్తోంది. దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకల పై ఈ సినిమా కథ ఉన్నట్టు తెలుస్తోంది.

    శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ లో విలన్ గా సోనూ సూద్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఇంకొకటి బయటకు వచ్చింది.

    Also Read: ఓరి నాయనో.. బట్టలన్నీ విప్పేసిన పాయల్!

    ఈ ఆచార్య మూవీలో మరో టాలెంటెడ్ నటుడు పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తాడట.. బెంగాళీ నటుడు ‘జిష్ణు సేన్ గుప్తా’ను విలన్ గా తీసుకున్నారు. ‘అశ్వథ్థామ’ సినిమాలో విలన్ గా నటించాడు జిష్ణు. ఆ తర్వాత నితిన్ ‘భీష్మ’లో నటించాడు. ఇప్పుడు ఆచార్య మూవీలోనూ పవర్ విలన్ రోల్ లో కనిపించనున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రాన్ని మే 13న రిలీజ్ చేయనున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్