https://oktelugu.com/

వామన్ రావు చనిపోతూ చెప్పిన పేరు.. సంచలన వీడియో బయటపెట్టిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో కలకలం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల హత్యలో సంచలన వీడియో బయటకు వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా ఈ వీడియోను బయటపెట్టారు. ఇదిప్పుడు వైరల్ గా మారింది. Also Read: లైవ్ వీడియో: ఉగ్రఘాతుకం.. పోలీసులపై కాల్పులు హైకోర్టు లాయర్ వామన్ రావు చనిపోతూ తనను టీఆర్ఎస్ నేతల పేర్లు చెప్పాడని ప్రచారం జరిగింది. వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పుడు ఆ హత్య సమయంలో అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2021 / 07:43 PM IST
    Follow us on

    తెలంగాణలో కలకలం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల హత్యలో సంచలన వీడియో బయటకు వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా ఈ వీడియోను బయటపెట్టారు. ఇదిప్పుడు వైరల్ గా మారింది.

    Also Read: లైవ్ వీడియో: ఉగ్రఘాతుకం.. పోలీసులపై కాల్పులు

    హైకోర్టు లాయర్ వామన్ రావు చనిపోతూ తనను టీఆర్ఎస్ నేతల పేర్లు చెప్పాడని ప్రచారం జరిగింది. వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పుడు ఆ హత్య సమయంలో అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. స్వయంగా చనిపోతూ హైకోర్టు న్యాయవాది వామన్ రావు టీఆర్ఎస్ కీలక నేత పేరు చెప్పడం వైరల్ గా మారింది.

    ప్రధానంగా హైకోర్టు లాయర్ వామన్ రావు హత్యలో టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ కీలకపాత్రధారి. అలాగే హత్యకు అన్నీ సమకూర్చింది టీఆర్ఎస్ కీలకనేత మేనల్లుడు బిట్టు శీను. తాజాగా పోలీసులు దీన్ని ధ్రువీకరించి   అరెస్టులు చేశారు.

    Also Read: ఆ టాప్ మూడు చానెళ్లను బహిష్కరించిన టీడీపీ.. కారణమిదే?

    కుంట శ్రీనివాస్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. కొంతకాలంగా కుంట శ్రీనివాస్ తో హైకోర్టు న్యాయవాది వామన్ రావుకు విభేదాలు ఉన్నాయి. వామన్ రావు స్వగ్రామం గుంజపడుగులో ఇద్దరి మధ్య భూవివాదం ఉన్నట్టు తెలిసింది.ఇక టీఆర్ఎస్ కీలక నేత అక్రమాలపై హైకోర్టులో వామన్ రావు కేసులు వేశారు.

    ఈ క్రమంలోనే కుంట శ్రీనివాస్ దాడి చేసి పారిపోయాక రోడ్డుపై చనిపోయే ముందు తన హత్యకు కారణం టీఆర్ఎస్ కీలక నేత అని న్యాయవాది వామన్ రావు స్వయంగా చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఇది నిజమైన వీడియోనా? లేక ఫేక్ అన్నది తేలాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.

    ఆ వీడియోను కింద చూడొచ్చు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్