https://oktelugu.com/

కొత్త జిల్లాలు.. ఏపీలో పెనుమార్పులు ఇవీ!

తెలంగాణ సీఎం కేసీఆర్ లాగానే ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. పాలనను ప్రజలకు చేరువ చేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కొత్త జిల్లాలను జనవరి 26 నుంచి మనుగడలోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే అధికారుల కమిటీ కొత్త జిల్లాలపై కసరత్తు పూర్తి చేసిందని మొత్తం 32 జిల్లాలు ఏపీలో ఏర్పాటు అవుతాయని సమాచారం. ఇక జిల్లాల ఏర్పాటుతో ఏపీలో పాలనలో పెనుమార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. Also Read: సీఎం జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2020 / 02:07 PM IST
    Follow us on

    తెలంగాణ సీఎం కేసీఆర్ లాగానే ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. పాలనను ప్రజలకు చేరువ చేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కొత్త జిల్లాలను జనవరి 26 నుంచి మనుగడలోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే అధికారుల కమిటీ కొత్త జిల్లాలపై కసరత్తు పూర్తి చేసిందని మొత్తం 32 జిల్లాలు ఏపీలో ఏర్పాటు అవుతాయని సమాచారం. ఇక జిల్లాల ఏర్పాటుతో ఏపీలో పాలనలో పెనుమార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది.

    Also Read: సీఎం జగన్ ఆ సీనియర్ మంత్రిని దూరం పెడుతున్నారా?

    జిల్లాల ఏర్పాటుతో కొన్ని శాఖలను ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలిసింది. ప్రత్యేకించి రెవెన్యూ, పోలీస్ శాఖల్లో పెనుమార్పులు జరుగనున్నాయని సమాచారం. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, పోలీస్ కమిషనరేట్లను పెంచడానికి అవకాశం ఉంది. కొత్త జిల్లాల నేపథ్యంలోనే పోలీస్ శాఖలో బదిలీలను డీజీపీ గౌతం సవాంగ్ నిషేధించారు. జిల్లాల ఏర్పాటు తర్వాతే బదిలీలు ఉండనున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థలో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాలతోపాటు పోలీస్ కమిషనరేట్లను పెంచాలని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఎస్పీ కార్యాలయాల స్థాయిని కమిషనర్ కార్యాలయంగా బదలాయిస్తారని సమాచారం.

    ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడల్లో మాత్రమే పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి సంఖ్య ఏడు నుంచి 10 పోలీస్ కమిషనరేట్ లు ఏర్పాటు కానున్నాయని సమాచారం. పోలీసు యూనిట్ల సంఖ్యను 18 నుంచి 29కి పెంచే అవకాశం కనిపిస్తోంది.విశాఖపట్నం పోలీస్ యూనిట్ ను మూడుగా విభజించి అరకు, అనాకపల్లి పోలీస్ యూనిట్లు ఏర్పాటవుతాయని తెలుస్తోంది. తూర్పు గోదావరిలో రంపచోడవంరం, రాజమండ్రి, కాకినాడ , అమలాపురం కేంద్రాలుగా యూనిట్లు ఏర్పడొచ్చు అంటున్నారు.పశ్చిమ గోదావరిలో ఏలురు, నరసాపురంలో యూనిట్లు ఏర్పాటు కావచ్చని అంటున్నారు. గుంటూరులో 3, ప్రకాశంలో బాపట్ల, ఒంగోలు కేంద్రాల్లో కొత్త యూనిట్లు రావచ్చని సమాచారం. తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మూడు చొప్పున, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెండుచొప్పున పోలీస్ యూనిట్లు ఏర్పాటు కావచ్చంటున్నారు.

    Also Read: పవన్ సంచలనం: గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ!

    ఏపీలో కొత్తగా కాకినాడ అర్బన్, నెల్లూరు అర్బన్, తిరుపతి అర్బన్, రాజమండ్రి అర్బన్, గుంటూరు అర్బన్ లను కమిషనరేట్ లుగా పెంచుతారని అంటున్నారు. దీంతో మొత్తం కమిషనరేట్ల సంఖ్య ఏడుకు పెరుగనుంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్