https://oktelugu.com/

హనీమూన్ లోనూ కాజల్ సంపాదన ఆగట్లేదు !

కరోనా మహమ్మారి రాకతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అయింది. పైగా నేటి జనరేషన్ కూడా డిజిటల్ డిఎన్ఏతోనే పుడుతున్నట్టు.. పిల్లలు స్మార్ట్‌ ఫోన్లలోని గేమ్స్ కి, పెద్దవాళ్ళు ఏమో సోషల్ మీడియా ఎకౌంట్స్ కి అలవాటు అయిపోయారు. అందుకే యాడ్ మేకర్స్ కూడా సోషల్ మీడియానే టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే కాజల్ అగర్వాల్ రీసెంట్ గా పెళ్లి చేసుకుంది, ప్రస్తుతం హనీమూన్ లో ఉంది. అయినా డబ్బు సంపాదన మాత్రం […]

Written By:
  • admin
  • , Updated On : November 15, 2020 / 02:20 PM IST
    Follow us on


    కరోనా మహమ్మారి రాకతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అయింది. పైగా నేటి జనరేషన్ కూడా డిజిటల్ డిఎన్ఏతోనే పుడుతున్నట్టు.. పిల్లలు స్మార్ట్‌ ఫోన్లలోని గేమ్స్ కి, పెద్దవాళ్ళు ఏమో సోషల్ మీడియా ఎకౌంట్స్ కి అలవాటు అయిపోయారు. అందుకే యాడ్ మేకర్స్ కూడా సోషల్ మీడియానే టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే కాజల్ అగర్వాల్ రీసెంట్ గా పెళ్లి చేసుకుంది, ప్రస్తుతం హనీమూన్ లో ఉంది. అయినా డబ్బు సంపాదన మాత్రం ఆపట్లేదు. ఓవైపు భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు తన బిజినెస్, బ్రాండింగ్స్ కొనసాగిస్తూ ఈ టైంలో కూడా బాగానే వెనుకేసుకుంటుంది.

    Also Read: సమంత సామ్-జామ్..అన్ని కలిపేసి కిచిడిలా మారిందా?

    ప్రెజెంట్ కాజల్ మాల్దీవుల్లో ఉంది. అయినా తన బ్రాండింగ్స్ అన్నీ టైమ్ ప్రకారం జరిగిపోయేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. నిన్న దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు ఓ శానిటైజర్ బ్రాండ్ కు ప్రచారం చేసింది. అలాగే ఇంకోవైపు తనకు ఇష్టమైన డిజైనర్, హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేస్తే.. దానికి కూడా ప్రమోషన్ చేసి పెట్టింది. ఇక కాజల్ ఓ బ్యాంక్ కోసం యాడ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లినా.. రెండు చేతులా తెగ సంపాదిస్తోంది.

    Also Read: బిగ్ బాస్-4.. ఎలిమినేషన్ లీక్.. ఈసారి మోహబూబ్ ఔట్

    మొత్తానికి హీరోయిన్స్ అందరూ చాల ప్లాన్డ్ గా ఉన్నారు. క్రేజ్ ఉండగానే ఫుల్ గా క్యాష్ చేసేసుకుంటున్నారు. దీనికితోడు కరోనా… మళ్ళీ సినిమాలతో ఎప్పుడు బిజీ అవుతామో తెలియదు కాబట్టి.. వచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకోవాలి. ఎంతైనా డబ్బులు రుచి మరిగిన ప్రాణాలు అయ్యే.. మరీ ఖాళీగా కూర్చోవాలంటే హీరోయిన్లకు ఎంత కష్టం.. నిజంగానే భరించలేనంత కష్టమే. అందుకే ప్రస్తుతం హీరోయిన్స్ అంతా ఈ లాక్ డౌన్ టైమ్ లో తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ నే ఆదాయ వనరుగా మార్చుకుని.. తమ ఫాలోయింగ్ ను కమర్షియల్ గా మార్చుకుంటున్నారు. ఏమైనా హీరోయిన్ల బిజినెస్ సూపర్ అనుకోవాల్సిందే.