ఏపీలో ప్రతిపక్షంలోకి జారిపోయిన తెలుగు దేశం పని అయిపోయిందా? ఆ పార్టీ ఇక కోలుకోదా? పార్టీని లేపడం చంద్రబాబు వల్ల కాదా? ఏపీలో సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నంబర్ 1గా దూసుకెళుతున్న సీఎం జగన్ ధాటికి టీడీపీ కనుమరుగు కావడం ఖాయమా? అంటే ఔననే అంటోంది నేషనల్ మీడియా..
Also Read: రెడ్డప్ప.. ఇలా మారావు ఏంటబ్బా?
తాజాగా ఏపీ రాజకీయాలపై సర్వే చేసిన అవుట్ లుక్ ఇండియా సంచలన నిజాలు వెల్లడించింది. ఏపీలో టిడిపి పతనం కావడం ఖాయమని అవుట్ లుక్ ఇండియా సర్వే చేసి విశ్లేషించింది. పార్టీ పతనం అంచున ఉందని మీడియా ధృవీకరిస్తోంది.
దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో అధికారంలో వైయస్ఆర్సిపి శక్తి అని.. యువకుడైన సీఎం జగన్ అని.. వీరి ధాటికి టిడిపి రాష్ట్రం నుండి పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని హెచ్చరించింది.
అవుట్ లుక్ కథనం ప్రకారం.. 2014 ఎన్నికలలోనే టిడిపి ఓడిపోయేదని తెలిపింది. కానీ నాడు వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు రుణమాఫీ వాగ్దానం చేయడానికి నిరాకరించడంతో ఆయన ఓడిపోయారని.. అదే రుణమాఫి చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచాడని పేర్కొన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ కేవలం 5 లక్షల ఓట్ల మెజారిటీతో వైసీపీపై అతికష్టం మీద విజయం సాధించిందని పేర్కొంది.
Also Read: సర్వే సంచలనం: పశ్చిమ బెంగాల్ లో గెలుపెవరిదంటే?
ఈ విషయంలో టిడిపి సీనియర్ నాయకుడు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. “సందేహం ఎక్కడ ఉంది? మేము 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి కోరల నుండి తృటిలోతప్పించుకున్నాము. నిజానికి జగన్ కనుక రైతు రుణమాఫి హామీ ఇచ్చి ఉంటే ఆనాడే గెలిచి ఉండేవాడు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ నేత పేర్కొన్నారు.
కాబట్టి, మొత్తంగా, టిడిపి ఏపీ రాజకీయాల్లో దశాబ్దాల వారసత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు పతనం దిశగా సాగుతోంది. మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ కనుమరుగు అయ్యే పరిస్థితికి దిగజారిందని అవుట్ లుక్ తెలిపింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్