రెడ్డప్ప.. ఇలా మారావు ఏంటబ్బా?

తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెుల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొన్ని నెలల కిందట ఆయన తాడిపత్రిలోజరిగిన ఇరువర్గాల ఘర్షణలో భాగంగా ఆయన పేరు మారుమోగింది. ఆ తరువాత చాలా రోజుల తరువాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు ప్రభాకర్ రెడ్డి. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేసిన ప్రభాకర్ రెడ్డి తాజాగా పోలీసులను మెచ్చుకోవడం సంచలనంగా మారింది. మరి ప్రభాకర్ రెడ్డి పోలీసులను మెచ్చుకోవాల్సిన […]

Written By: NARESH, Updated On : February 18, 2021 10:40 am
Follow us on

తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెుల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొన్ని నెలల కిందట ఆయన తాడిపత్రిలోజరిగిన ఇరువర్గాల ఘర్షణలో భాగంగా ఆయన పేరు మారుమోగింది. ఆ తరువాత చాలా రోజుల తరువాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు ప్రభాకర్ రెడ్డి. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేసిన ప్రభాకర్ రెడ్డి తాజాగా పోలీసులను మెచ్చుకోవడం సంచలనంగా మారింది. మరి ప్రభాకర్ రెడ్డి పోలీసులను మెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఎందుకలా అన్నారు..?

Also Read: సర్వే సంచలనం: పశ్చిమ బెంగాల్ లో గెలుపెవరిదంటే?

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో నిత్యం ఫ్యాక్షనిజం గొడవలు జరుగుతుంటాయి. ఇక్కడ ఆదిరెడ్డి, జేసీ బ్రదర్స్ మధ్యపచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పోరు ఉంటుంది. ఇక ఏ ఎన్నికలు వచ్చినా ఈ జిల్లాలో పోలీసుల బందోబస్తు పటిష్టంగా ఉంటుంది. జేసీ బ్రదర్స్ టీడీపీలోకి రాగా.. ఆదిరెడ్డి వైసీపీలోకి మారారు. దీంతో ఇరు నాయకుల మధ్య ఏ ఎన్నికలైనా పోటీ ఉండడంతో పాటు వర్గ పోరు తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల కిందట జరిగిన ఇరువర్గాల ఘర్షనలో తమపై పోలీసులు అనవసరంగా కేసులు నమోదు చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించేవారు.

ఏపీలో ఇటీవల రెండు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలీసుల పనితీరు బాగుందని ప్రభాకర్ రెడ్డి మెచ్చుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నకల్లో గెలుపోటములు ఎలాగున్నా పోలీసులు చాలా శ్రద్ధతో పనిచేశారన్నారు. పోలీసులు ఇంతలా పనిచేస్తారని తాను కూడా అనుకోలేదని వారి పనితీరుకు హ్యాట్సాప్ అన్నారు.

Also Read: లాయర్ల హత్య కేసీఆర్ కు బర్త్ డే గిఫ్ట్.. బండి సంజయ్ సంచలన ఆరోపణ

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పోలీసుల అధికార పక్షానికి 60 శాతం సపోర్టు చేశారని, ఇది సహజమేనన్నారు. మిగిలిన 40 శాతంగా వారి పనితీరును మెచ్చుకోవచ్చన్నారు. వైసీపీ, టీడీపీ అని తేడా లేకుండా వారు పనిచేయడం అభినందనీయమన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచినా.. ఓడినా పట్టించుకోనని.. అయితే పోలీసుల పనితీరు మాత్రం అద్భుతంగా ఉందన్నారు.

నిత్యం పోలీసులు అంటే భగ్గుమనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగి ఇలా మాట్లాడడంపై పలువురు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా వైసీపీనాయకులు ప్రభాకర్ రెడ్డి మాట టీరుపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. పోలీసులతో వేధింపులు తాళలేక పార్టీ మారుతున్నారా..? అని చర్చించుకుంటున్నారు. లేక టీడీపీతో ఇక తనకు భవిష్యత్తు ఉండదని నిర్ణయించుకున్నాడా..? అని వాపోతున్నారు. అయితే త్వరలో తాడిపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి..

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్