తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత.. ఆంధ్రాలో జగన్ పై అప్యాయత ఎందుకు పెరుగుతోంది.?

కేసీఆర్ కు జగన్ కు ఇదే తేడా.. ఇద్దరు సీఎంలలో కేసీఆర్ గర్భగుడి (ప్రగతి భవన్) నుంచి మాత్రమే ప్రజలకు దర్శనమిస్తాడు. వారి సమస్యలను దూరం నుంచి వింటాడు. కానీ జగన్ మాత్రం ఉత్సవ విగ్రహంలా బయటకు వచ్చి ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుంటాడు. అందుకే కాబోలు తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత.. ఆంధ్రాలో జగన్ అప్యాయత పెరుగుతోంది. తాజాగా ఏపీని కుదిపేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని సీఎం జగన్ చాకచక్యంగా తనవైపుకు తిప్పుకున్న […]

Written By: NARESH, Updated On : February 18, 2021 3:48 pm
Follow us on

కేసీఆర్ కు జగన్ కు ఇదే తేడా.. ఇద్దరు సీఎంలలో కేసీఆర్ గర్భగుడి (ప్రగతి భవన్) నుంచి మాత్రమే ప్రజలకు దర్శనమిస్తాడు. వారి సమస్యలను దూరం నుంచి వింటాడు. కానీ జగన్ మాత్రం ఉత్సవ విగ్రహంలా బయటకు వచ్చి ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుంటాడు. అందుకే కాబోలు తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత.. ఆంధ్రాలో జగన్ అప్యాయత పెరుగుతోంది. తాజాగా ఏపీని కుదిపేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని సీఎం జగన్ చాకచక్యంగా తనవైపుకు తిప్పుకున్న తీరు చూశాక అందరూ జగన్ ను వేయినోళ్ల పొగుడుతున్నారు. స్వయంగా విశాఖకు వచ్చి మరీ చంద్రబాబు రాజకీయాలకు చెక్ చెప్పి.. స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులతో భేటి అయ్యి వారి సమస్యలు పరిష్కరించిన వైనం అందరినీ ఫిదా చేసింది. కేసీఆర్ లో ఈ తీరు లేకపోవడమే మైనస్ అంటున్నారు..

Also Read: టీడీపీ పతనం ఖాయమట.. జాతీయ మీడియా సంచలన నిజాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేంద్రంలోని బీజేపీ కారణం.. ఆ ఉద్యమాన్ని రాజీనామాతో రగలించింది ప్రతిపక్ష టీడీపీ.. ఏపీ బీజేపీ కూడా తాము స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించమని మొసలి కన్నీరు కార్చింది. ఈ క్రమంలోనే ఈ ఉద్యమంలో ఇన్నాళ్లు వెనుకబడిన అధికార వైసీపీ ఇప్పుడు సీఎం జగన్ వేసిన ఒకే ఒక ప్లాన్ తో అందరికంటే ముందంజలో నిలిచింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమకారుల మనసులను సీఎం జగన్ గెలుచుకున్నారు.

ఉద్యమంలో వైసీపీ పార్టీ వెనుకబడినప్పటికీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాలతో భేటి అయ్యి ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా వారితో కలిసి వ్యూహాలు రూపొందించి ఉద్యమకారుల హృదయాలను గెలుచుకున్నాడనే చెప్పొచ్చు.

ఈ భేటికి ఒక్కరోజు ముందు మంగళవారం జగన్ ప్రత్యర్థి.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించి ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు పెట్టడం మానేయాలని ముఖ్యమంత్రికి బహిరంగ సవాలు విసిరారు. అయితే చంద్రబాబుకు కౌంటర్ ఇస్తూ ఆయన వచ్చిన తెల్లవారే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖకు వచ్చి మరీ ట్రేడ్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి వారితో దాదాపు 30 నిమిషాలు ప్లాంట్ ను కాపాడుకునే దిశగా కీలక చర్యలు చేపట్టారు. పెట్టుబడుల పెట్టుబడి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ తాను ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు వారికి తెలియజేసి.. ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా చేయడానికి వ్యూహాలు రూపొందించారు.

Also Read: రెడ్డప్ప.. ఇలా మారావు ఏంటబ్బా?

ప్రజల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని.. విశాఖ ప్రజల వైభవానికి సాక్ష్యంగా నిలుస్తున్న ఉక్కు కర్మాగారాన్ని పునరుద్ధరించడానికి మరియు రక్షించడానికి ప్రత్యామ్నాయ చర్యలను చేపడుతున్నట్టు ప్రకటించారు. ఉక్కు కర్మాగారం కోసం ఇనుప ఖనిజం గనులను ఇవ్వమని తాను కేంద్రాన్ని కోరుతున్నానని.. అవి ఇస్తే ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని.. ఈ పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇక విశాఖ ప్లాంట్ లో కేంద్రం ప్రతిపాదించిన పోస్కో స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో పెట్టనీయను అని సీఎం జగన్ కార్మికులకు హామీ ఇచ్చారు.

సీఎం జగన్ హామీతో ఆందోళన చెందుతున్న ట్రేడ్ యూనియన్ నాయకులకు.. వారి ప్రతినిధులకు ఊరట లభించింది. విశాఖపట్నంలో కాకుండా రాష్ట్రంలో మరెక్కడైనా పెట్టుబడులు పెట్టమని పోస్కోను అభ్యర్థిస్తానని జగన్ మోహన్ రెడ్డి కార్మిక నేతలతో చెప్పారు. అప్పటిదాకా ఆందోళన చెందిన ట్రేడ్ యూనియన్ నాయకులు.. ఆశ్చర్యకరంగా, జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా అంతకు ముందు రోజే కార్మికులను కలిసిన చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలిందనే చెప్పాలి.

ఇలా ప్రజలకు చేరువ అవ్వడంలో యువకుడైన జగన్ చొరవ తీసుకుంటున్న విధానం వారికి చేరువ చేస్తోంది. అదే కేసీఆర్ ధీనికి భిన్నంగా ప్రగతి భవన్ లోనే ఉంటూ ప్రజలకు దూరమైపోతున్నారన్న చర్చ సాగుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్