కేంద్రంలోని బీజేపీ సర్కారును ప్రధాని మోదీ సమర్థవంతంగా నడిపిస్తున్నారు. దేశ ప్రజల రక్షణ.. అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ ఏమాత్రం రాజీపడటం లేదు. ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.
Also Read: చైనా అత్యుత్సాహం.. హిందూ మహాసముద్రంలోకి డ్రోన్లు
శత్రుదేశమైన పాకిస్థాన్.. జిత్తులమారి చైనా విషయంలో ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పాకిస్థాన్ ను నేరుగా ఎదుర్కొంటూనే చైనాను ధీటుగా ఎదుర్కొంటున్నారు. సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేస్తున్నారు. ఇదే సమయంలో సంచలన నిర్ణయాలను మోదీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.
మోదీ ప్రధాని అయ్యాక దేశానికి సంబంధించిన ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకుంటూ పోయారు. 370 ఆర్టికల్ రద్దు.. కాశ్మీర్ ను రెండుగా విభజించటం.. త్రిపుల్ తలాక్ రద్దు.. వ్యవసాయ సంస్కరణలు వంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని సునితమైన విషయాల్లోనూ కఠినంగా వ్యవహరించడంతో ఆయావర్గాల్లో కొంత వ్యతిరేకత వచ్చినట్లు కన్పిస్తోంది. అయితే మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం ప్రధాని మోదీకి మోజార్టీ ప్రజలు పట్టం కట్టినట్లు తాజాగా వెల్లడించింది.
Also Read: కొత్త సంవత్సరం వేళ.. కేసీఆర్ స్వీట్ న్యూస్
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్న ఆదరణ.. నిరాధరణపై మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోదీకి 75శాతం ప్రజల్లో ఆదరణ లభించగా.. 20శాతం నిరాధరణ వచ్చింది. దీంతో మోదీకి 55శాతం ప్రజలు పట్టం కట్టినట్లు ఆ సర్వే ప్రకటించింది.
అదేవిధంగా జర్మనీ ఛాన్స్ లర్ ఏంజలా మెర్కెల్ కు 24శాతం ఆదరణ ఉన్నట్లు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ పేర్కొంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ కు మాత్రం ప్రజల్లో ఆదరణ కంటే నిరాధరణ ఎక్కువగా వచ్చిందని తేల్చిచెప్పింది. దీంతో ఆయనకు నెగిటివ్ రేటింగ్ వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్