Homeఎంటర్టైన్మెంట్మెగాస్టార్ నుండి ఎమోషనల్ విషెస్ !

మెగాస్టార్ నుండి ఎమోషనల్ విషెస్ !

Chiranjeevi New Year
మొత్తానికి చూస్తుండగానే ఈ ఏడాది కొత్త సంవత్సరం వచ్చేసింది. కరోనాతో ఎన్నో చేదు జ్ఞాపకాలు అందించి 2019 కాలగర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతం, కొత్త ఏడాది మొదటి రోజు కావడంతో ప్రతి ఒక్కరూ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కనీసం ఈ సంవత్సరం అయినా అందరికీ మంచి జరగాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు.

Also Read: ఎంత చెప్పినా విజయ్ దేవరకొండ వినలేదట !

కాగా మెగాస్టార్ కూడా 2021 న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఓ వీడియోని పోస్ట్ చేశారు. “థ్యాంక్యు 2020, మాకు ఓర్పును నేర్పావు, మా జీవితాలను మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావు. వెల్ కమ్ టూ ది న్యూఇయర్, ఈ కొత్త సంవత్సరం అందరికి బాగుండాలి. బోలెడంత సంతోషాన్ని ఇవ్వాలి. మీ కలలన్ని నిజం కావాలి. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ కూడా రావాలి. విష్ యూ ఏ వేరీ హ్యప్పీ హెల్తీ అండ్ ఫుల్ ఫిల్లింగ్ న్యూఇయర్ అంటూ మెగాస్టార్ తన విలువైన మెసేజ్ ను ఫ్యాన్స్ కు తెలియజేశారు.

Also Read: ర‌వితేజ సినిమాకి వెంకీ మాట సాయం !

ఏది ఏమైనా 2021 సంవత్సరానికి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‏గా స్వాగతం పలికారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. అన్నట్లు త్వరలోనే ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక సినీ ఇండస్ట్రీకి తీరని నష్టాన్ని తీసుకువచ్చింది ఈ సంవత్సరం. అయితే, ఈ కరోనా లైఫ్‌లో వ్యక్తిగతంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే సమయం ఉండదు. అందుకే సెల్ ఫోన్ లో వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలను పంపిస్తున్నారు అందరూ.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version