https://oktelugu.com/

తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి

తిరుమల శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం తిరుపతిలో అడుగుపెట్టారు. ఆయన ప్రయాణించిన విమానం రేణిగుంటలో టేకాప్ తీసుకుంది. దీంతో రాష్ట్రపతికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. అనంతరం రేణిగుంట నుంచి అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు […]

Written By: , Updated On : November 24, 2020 / 12:25 PM IST
Follow us on

తిరుమల శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం తిరుపతిలో అడుగుపెట్టారు. ఆయన ప్రయాణించిన విమానం రేణిగుంటలో టేకాప్ తీసుకుంది. దీంతో రాష్ట్రపతికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. అనంతరం రేణిగుంట నుంచి అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.