తెలంగాణలో కొంతకాలంగా టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గడిచిన ఆరేళ్లలో తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళ్లిన కారు ఇటీవల రిపేరుకు వచ్చినట్లు కన్పిస్తోంది.
Also Read: కేంద్రం చేతిలో జగన్ కీలుబొమ్మ.. అందుకేనా..!
దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్.. బీజేపీ మధ్య ఓటింగ్ హోరాహోరీగా నడిచింది. ఈ ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వెయ్యిపైగా ఓట్లతో గెలుపొందాడు.
ఆ వెంటనే వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి షాకిచ్చింది. టీఆర్ఎస్ గ్రేటర్లో 56సీట్లు రాగా బీజేపీ 48సీట్లను కైవసం చేసుకొని టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కకుండా చేయగలిగింది.
అంతకముందు జీహెచ్ఎంసీలో బీజేపీ కేవలం 4సీట్లు ఉండగా ప్రస్తుతం 48కి చేరడంతో ఆ పార్టీ తెలంగాణలో ఏమేరకు బలపడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాబోయే నాగార్జున్ ఉప ఎన్నికపై బీజేపీపై ఇప్పటికే దృష్టిసారించింది.
Also Read: రాష్ట్రపతి భవన్‌కు కాలినడకన రాహుల్
టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ ఈ సీటు గెలుచుకోనేందుకు పావులు కదుపుతోంది. ఇక టీఆర్ఎస్ కు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక కత్తి మీద సాములా మారుతోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ హవా తగ్గలేదని నిరూపించుకోవాలని తప్పనిసరిగా నాగార్జున్ సాగర్లో ఆ పార్టీ గెలిచి తీరాల్సిందే. ఈ స్థానంలో కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. దీంతో నాగార్జున్ ఉప ఎన్నిక త్రిముఖ పోటీగా మారుతోంది.
నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక ఫలితం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జమిలికి సిద్ధమవుతున్న పార్టీలకు ఈ ఉప ఎన్నిక ఫలితమే రాబోయే అసెంబ్లీ ఎన్నికల గెలుపునకు నాంది కానుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్