https://oktelugu.com/

బిగ్ బాస్ కోసం జబర్ధస్త్ కి పదిలక్షలు చెల్లించా… అవినాష్ సంచలనం!

బిగ్ బాస్ సీజన్ ముగిసినా ప్రేక్షకులు ఆ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇస్తున్న ఇంటర్వ్యూలను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఈ సీజన్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న కంటెస్టెంట్స్ లో జబర్ధస్త్ అవినాష్ ఒకరు. వైల్డ్ కార్డు ద్వారా సెకండ్ వీక్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్, కమెడియన్ అన్న నేమ్ సార్ధకం చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ తన మార్కు కామెడీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంటి సభ్యులను అవినాష్ ఇమిటేట్ చేసి […]

Written By:
  • admin
  • , Updated On : December 24, 2020 / 11:27 AM IST
    Follow us on


    బిగ్ బాస్ సీజన్ ముగిసినా ప్రేక్షకులు ఆ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇస్తున్న ఇంటర్వ్యూలను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఈ సీజన్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న కంటెస్టెంట్స్ లో జబర్ధస్త్ అవినాష్ ఒకరు. వైల్డ్ కార్డు ద్వారా సెకండ్ వీక్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్, కమెడియన్ అన్న నేమ్ సార్ధకం చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ తన మార్కు కామెడీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంటి సభ్యులను అవినాష్ ఇమిటేట్ చేసి చూపించే విధానానికి ప్రేక్షకులు భలే ఎంజాయ్ చేసేవారు. చివరకు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున సైతం అవినాష్ కామెడీని ఇష్టపడేవారు. బిగ్ బాస్ ఫైనలిస్ట్స్ లో అవినాష్ ఖచ్చితంగా ఉంటాడని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా 13వ వారం అవినాష్ ఎలిమినేటై హౌస్ నుండి బయటికి రావడం జరిగింది.

    Also Read: మర్డర్ మూవీ రివ్యూ: ఈసారి ప్రేక్షకులు ‘మర్డర్’ కాలేదు

    బిగ్ బాస్ తరువాత అవినాష్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. ఆయనతో టెలివిజన్ ఛానల్స్ కొన్ని కామెడీ షోలు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం అందుతుంది. అలాగే అనేక మీడియా ఛానల్స్ కి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తనను చూడడానికి పక్కజిల్లాల వాళ్ళు కూడా ఇంటికి వస్తున్నారని అవినాష్ చెప్పడం ఆతని ఫేమ్ కి నిదర్శనం. కాగా అవినాష్ యాంకర్ శ్రీముఖితో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అవినాష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ మరియు జబర్ధస్త్ గురించి అవినాష్ చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి.

    Also Read: సోహెల్‌కు సినిమా ఆఫర్‌‌.. రేపే ప్రకటిస్తారట

    బిగ్ బాస్ నిర్వాహకులు తనకు పదే పదే ఫోన్ చేసేవారని అవినాష్ చెప్పారు. అయితే తనను వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి పంపిస్తున్న విషయం చెప్పలేదు అన్నాడు. క్వారంటైన్ తరువాత హౌస్ లోకి పంపే ముందు తనది వైల్డ్ కార్డు ఎంట్రీ అని చెప్పారని అవినాష్ తెలియజేశాడు. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి అవినాష్ జబర్ధస్త్ యాజమాన్యానికి డబ్బులు చెల్లించాడట. అగ్రిమెంట్ బ్రేక్ చేసి మధ్యలో వైదొలిగినందుకు రూ. 10 లక్షలు వాళ్లకు చెల్లించినట్లు తెలియజేశారు. అంత పెద్ద మొత్తం అక్కడ చెల్లించాడు కాబట్టే అవినాష్ ఎలిమినేషన్స్ కి బయపడేవారని ఇప్పుడు అర్థం అవుతుంది. ఇక బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ రూ. 40లక్షలు పొందారని వార్తలు వస్తుండగా… జబర్ధస్త్ వాళ్లకు చెల్లించిన రూ. 10లక్షలు తీసివేస్తే మొత్తంగా అతనికి రూ. 30 దక్కినట్లు అయ్యింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్