https://oktelugu.com/

‘మడ్డీ’ టీజర్ టాక్: బురదరోడ్డులో ఫైట్ ఉత్కంఠభరితం

సాహసోపేత రేసింగ్ స్టంట్లు కథాంశంగా.. రియల్ స్టంట్స్.. ఎంతో శోధించి తెరకెక్కిన ‘మడ్డీ’ టీజర్ ను తాజాగా టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశాడు. గూస్ బాంబ్స్ ఇచ్చే రియల్ స్టంట్స్, గగుర్పొడేచే పోరాట దృశ్యాలతో ‘మడ్డీ ’ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ వేసవి కానుకగా ప్యాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీ టీజర్ ను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. మట్టి రోడ్డుపై రేస్ ను చూపించబోతున్న సినిమా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 27, 2021 / 08:50 AM IST
    Follow us on

    సాహసోపేత రేసింగ్ స్టంట్లు కథాంశంగా.. రియల్ స్టంట్స్.. ఎంతో శోధించి తెరకెక్కిన ‘మడ్డీ’ టీజర్ ను తాజాగా టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశాడు. గూస్ బాంబ్స్ ఇచ్చే రియల్ స్టంట్స్, గగుర్పొడేచే పోరాట దృశ్యాలతో ‘మడ్డీ ’ టీజర్ ఆకట్టుకుంటోంది.

    ఈ వేసవి కానుకగా ప్యాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీ టీజర్ ను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.

    మట్టి రోడ్డుపై రేస్ ను చూపించబోతున్న సినిమా ‘మడ్డీ’. అయిదు భాషల్లో రిలీజ్ చేస్తున్న ఈ మూవీని ఆన్ లైన్ లో విడుదల చేశారు. డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీలో యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అడ్వంచర్ రేసింగ్ ఇష్టపడేవారికి నచ్చేలా ఉంది టీజర్. రవిబస్రూర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.

    కత చూస్తే రెండు బృందాలు బురద దారుల్లో పోటీపడడం.. ఈ పోటీలో చోటుచేసుకున్న రకరకాల సంఘటనలు ఎట్ ఏ గ్లాన్స్ టీజర్ లో చూపించారు. ప్యాన్ ఇండియా లెవల్లో తీసిన మూవీని ఈ సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నారు.