https://oktelugu.com/

ఓం నమశ్శివాయ”అనే మంత్రం కన్నా మూడు కోట్ల రెట్లు అధికమైన మంత్రం ఏదో తెలుసా..?

సాధారణంగా మన ఇంట్లో పూజలు చేసే సమయంలో లేదా, దేవాలయాలను దర్శించినప్పుడు భగవంతుని నామ జపాన్ని స్మరిస్తూ పూజలు చేస్తుంటాము. అయితే కేవలం నామాలను చదువుతూ పూజ చేస్తాము తప్ప,దాని వెనుక ఉన్న అర్థం, పరమార్థం తెలియదు. ఈ విధంగా ఎంతో మహిమ కలిగిన దేవ దేవతల నామస్మరణాలు ఉన్నాయి. అందులో “అరుణాచల నామం” ఒకటి. మనం పూజ చేసేటప్పుడు అరుణాచల నామం పలకటం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం… Also Read: మహాలక్ష్మి అనుగ్రహం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 27, 2021 10:36 am
    Follow us on

    Arunachal Mantra

    సాధారణంగా మన ఇంట్లో పూజలు చేసే సమయంలో లేదా, దేవాలయాలను దర్శించినప్పుడు భగవంతుని నామ జపాన్ని స్మరిస్తూ పూజలు చేస్తుంటాము. అయితే కేవలం నామాలను చదువుతూ పూజ చేస్తాము తప్ప,దాని వెనుక ఉన్న అర్థం, పరమార్థం తెలియదు. ఈ విధంగా ఎంతో మహిమ కలిగిన దేవ దేవతల నామస్మరణాలు ఉన్నాయి. అందులో “అరుణాచల నామం” ఒకటి. మనం పూజ చేసేటప్పుడు అరుణాచల నామం పలకటం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…

    Also Read: మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే… శుక్రవారం గోరింటాకు పెట్టుకోవాలి..!

    అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. ఎంతో ప్రసిద్ధి చెందిన అరుణాచలం వేద పురాణాలలో పేరు గాంచిన పుణ్యక్షేత్రం అని చెప్పవచ్చు. ఎంతో మహిమగల ఈ అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు. అరుణాచలేశ్వర దేవాలయం శివుడు ఆజ్ఞాపించడం వల్ల విశ్వకర్మ చేత నిర్మించబడినది. అదే విధంగా ఈ ఆలయం చుట్టూ అరునపురం అనే ప్రాంతాన్ని నిర్మించబడినది అని పురాణాలు చెబుతున్నాయి.

    Also Read: గురువారం తెల్లని వస్తువులను దానం చేస్తే…!

    ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి ప్రదక్షిణలు చేయటంవల్ల సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రదక్షిణలు చేసినట్లు అని భావిస్తారు. అదే విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ అరుణాచలం నామాన్ని పట్టించడం వల్ల ఎంతో పుణ్య ఫలమని పండితులు తెలియజేస్తున్నారు. అరుణాచల నామం… ఓం నమశ్శివాయ అనే మంత్రం కన్నా మూడు కోట్ల రెట్లు అధికం. మూడు కోట్ల సార్లు ఓం నమ శివాయ అనే నామాన్ని పట్టించడంవల్ల వచ్చే పుణ్య ఫలం ఒక అరుణాచలం అనే మంత్రాన్ని జపించడం వల్ల వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.ఇది ఎలా సాధ్యం అనే సందేహం అందరికీ కలుగుతుంది. కానీ అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి. నమశ్శివాయ అనేది యోగ పంచాక్షరి అనే విషయాన్నిస్కాంద పురాణంలో కూడా చెప్పడం వల్ల అరుణాచల మంత్రానికి అంతటి పుణ్యఫలం ఉందని ఆధ్యాత్మిక పండితులు తెలుపుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం