అయోధ్యలో మసీదు.. అబ్బురపరిచేలా ఉందిగా..!

భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం ప్రతీక. ఈ వినూత్న లక్షణమే ప్రపంచానికి భారత్ గొప్పతనాన్ని చాటి చెబుతోంది. ప్రపంచంలోని దేశాలన్నీ ఒక ఎత్తయితే భారత్ మరో ఎత్తు అని మరోసారి ఎలుగెత్తి చాటేందుకు సిద్ధమైంది. Also Read: రైతుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? అయోధ్యలో రామమందిరంతోపాటు మసీదు నిర్మాణం జరుగనున్న సంగతి తెల్సిందే. రామమందిరం హిందువుల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణం కానుండగా.. ముస్లింల మనోభావాలకు అనుగుణంగా మసీదు నిర్మాణం జరుగనుంది. రాముడి జన్మభూమిపై వివాదం కొన్నేళ్లపాటు సాగగా ఇటీవలే […]

Written By: Neelambaram, Updated On : December 20, 2020 5:29 pm
Follow us on

భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం ప్రతీక. ఈ వినూత్న లక్షణమే ప్రపంచానికి భారత్ గొప్పతనాన్ని చాటి చెబుతోంది. ప్రపంచంలోని దేశాలన్నీ ఒక ఎత్తయితే భారత్ మరో ఎత్తు అని మరోసారి ఎలుగెత్తి చాటేందుకు సిద్ధమైంది.

Also Read: రైతుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది?

అయోధ్యలో రామమందిరంతోపాటు మసీదు నిర్మాణం జరుగనున్న సంగతి తెల్సిందే. రామమందిరం హిందువుల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణం కానుండగా.. ముస్లింల మనోభావాలకు అనుగుణంగా మసీదు నిర్మాణం జరుగనుంది.

రాముడి జన్మభూమిపై వివాదం కొన్నేళ్లపాటు సాగగా ఇటీవలే సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది.

అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూపీ సర్కారు ఇచ్చిన స్థలానికి సున్నీ వక్ఫ్ బోర్డు అంగీకరించింది. మసీదు నిర్మాణం కోసం ఐఐసీఎఫ్ ట్రస్టును ఏర్పాటు చేసింది.

ఇప్పటికే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ విడుదల చేయగా ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు.

Also Read: రాష్ట్రపతి శీతాకాలం విడిది వాయిదా పడినట్టేనా?

ఇక తాజాగా అయోధ్యలో నిర్మించే మసీదుకు సంబంధించిన డిజైన్ విడుదలైంది. జామియా మిల్లాయా ఇస్లామియా యూనివర్సిటీ అర్కిటెక్ట్ విభాగపు ప్రొఫెసర్ ఎస్ఎం అఖ్తర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని విడుదల చేశారు.

మసీదు డిజైన్ ప్రతీఒక్కరిని అబ్బురపరుస్తోంది. దీనిని అయోధ్య సమీపంలోని ధన్నీపూర్ లో నిర్మించనున్నారు. ఐదెకరాల్లో నిర్మించనున్న ఈ మసీదులో ఒకేసారి 2వేల మంది నమాజు చేసుకునే అవకాశం ఉండనుంది.

మసీదుతోపాటు ఆసుపత్రి.. లైబ్రరీ.. మ్యూజియం.. కమ్యూనిటీ కిచెన్ కూడా నిర్మించనున్నారు. ఈ మసీదు నిర్మాణానికి జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ డిజైన్ అధికారికంగా ఖరారు కావాల్సి ఉందని సమాచారం.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్