ఎంకిపెళ్లి సుబ్బి చావు కొచ్చిందంటే ఇదేనేమో.. ఏదైనా మంచి అయినా చెడు అయినా మెగా బ్రదర్ నాగబాబు మనసులో దాచుకోకుండా కక్కేస్తుంటాడు. ఇప్పుడు అదే జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ లో ఆగ్రహానికి కారణమైంది.
సీఎం జగన్ తాజాగా సినీ పరిశ్రమపై వరాలు కురిపించారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేశారు. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపారు..థియేటర్లు చెల్లించాల్సిన 3 నెలల ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: టీడీపీకి షాక్.. అంగుళం భూమిని వదలని జగన్
చిరంజీవి, రాంచరణ్ కూడా సీఎం జగన్ ఇండస్ట్రీకి కురిపించిన వరాలపై ధన్యవాదాలు తెలిపారు. అయితే నాగబాబు ట్వీట్ పై మాత్రం రచ్చ మొదలైంది.
సీఎం వైఎస్ జగన్ కు మెగా బ్రదర్.. జనసేన అధినేత పవన్ అన్నయ్య నాగబాబు ధన్యవాదాలు తెలుపడం హాట్ టాపిక్ గా మారింది. ట్వీట్ చేసిన నాగబాబు ‘సీఎం జగన్ నిర్ణయంతో లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చారని.. ఏపీ సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. ఆపత్కాలంలో పరిశ్రమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు ’ తెలిపారు. ప్రభుత్వం చొరవతో మూవీ ఇండస్ట్రీకి జవసత్వాలు వస్తాయని నాగబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read: రైతుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది?
పవన్ అంటే ప్రాణమిచ్చే నాగబాబు ఇలా పవన్ ప్రత్యర్థి జగన్ ను పొగడడంతో వైసీపీ శ్రేణులు దీన్ని వైరల్ చేశాయి. స్వతహాగా జనసేన నాయకుడు నాగబాబు.. సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పినందుకు జనసేన కార్యకర్తలు.. పవన్ ఫ్యాన్స్ ఫీలవుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారట.. ఇలా వైసీపీ, జనసేన మధ్యలో పాపం నాగబాబు బుక్కయ్యాడట..
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్