https://oktelugu.com/

సంక్రాంతికి బరిలో దిగిన పందెం కోళ్లు

కరోనా కొర్లల్లో చిక్కుకొని మూతబడిన థియేటర్స్ బూజు దులుపుతున్నారు యజమానులు. పరిస్థితి పూర్తిగా అదుపులో రాకపోయినా సినిమా సంబరం అయితే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పాక్షింగా థియేటర్స్ తెరుచుకోగా, కొత్త సినిమాల విడుదల తేదీలు వచ్చేశాయి. ముందుగా మెగా హీరో ధైర్యం చేసి వచ్చేస్తున్నాడు. సాయి ధరమ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. కాగా మరో కొన్ని రోజులలో పెద్ద పండుగ సంక్రాంతి ఉండగా.. విడుదలయ్యే సినిమాలు […]

Written By:
  • admin
  • , Updated On : December 20, 2020 / 12:08 PM IST
    Follow us on


    కరోనా కొర్లల్లో చిక్కుకొని మూతబడిన థియేటర్స్ బూజు దులుపుతున్నారు యజమానులు. పరిస్థితి పూర్తిగా అదుపులో రాకపోయినా సినిమా సంబరం అయితే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పాక్షింగా థియేటర్స్ తెరుచుకోగా, కొత్త సినిమాల విడుదల తేదీలు వచ్చేశాయి. ముందుగా మెగా హీరో ధైర్యం చేసి వచ్చేస్తున్నాడు. సాయి ధరమ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. కాగా మరో కొన్ని రోజులలో పెద్ద పండుగ సంక్రాంతి ఉండగా.. విడుదలయ్యే సినిమాలు ఏమిటనే ఆసక్తి సినిమా ప్రేమికులలో మొదలైపోయింది.

    Also Read: బిగ్ బాస్ లీక్: విన్నర్, రన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది!

    సంక్రాంతి పండగలో సినిమా అనేది ఒక భాగం అని చెప్పాలి. ఎక్కడెక్కడి వారు సొంత ఊళ్లకు చేరి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకునే ఈ పండుగ, తెలుగువారికి చాలా ప్రత్యేకం. పండుగ దినాలలో ఏదో ఒక రోజు ఇంటిల్లపాది సినిమాకు వెళ్లడం ఆనవాయితీ. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే సంక్రాంతి సీజన్ కోసం తీవ్ర పోటీ ఉంటుంది. ఐతే కరోనా కారణంగా ఈ ఏడాది ఏమంత గట్టి పోటీలేదు. కాగా సంక్రాంతి బరిలో దిగుతున్నామని ముగ్గురు హీరోలు కన్ఫర్మ్ చేశారు. రవితేజ, రానా దగ్గుబాటి మరియు రామ్ తమ చిత్రాలతో సంక్రాంతి బరిలో దిగనున్నారు.

    గోపి చంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీ జనవరి 14న విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై అధికారిక ప్రకటన నిర్మాతలు విడుదల చేయడం జరిగింది. ఇక రానా నటించిన పాన్ ఇండియా మూవీ హాథీ మేరె సాథీ సైతం సంక్రాంతి బరిలో నిలిచింది. అరణ్య పేరుతో తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రం సైతం జనవరి 14 విడుదల తేదీగా ప్రకటించారు. గత ఏడాది ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాపడుతూ వస్తుంది.

    Also Read: ఆర్జీవీని పట్టించుకుంటలేరా..!

    ఇక హీరో రామ్ లేటెస్ట్ మూవీ రెడ్. తమిళ్ హిట్ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. వీటితో పాటు హీరో విజయ్ నటించిన మాస్టర్ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. మాస్టర్ మూవీ జనవరి 13న తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. తమిళ చిత్రం అయినప్పటికీ ఈ మూవీపై భారీ క్రేజ్ ఉంది. ఈ నాలుగు చిత్రాలు ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్