
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు బ్యాంకు ఖాతాలు, యూపీఐ యాప్ ల ద్వారా ఖాతాదారులకు తెలియకుండానే నగదును మాయం చేస్తున్నారు. దీంతో అవాక్కవడం ఖాతాదారుల వంతవుతోంది. నగరాలు, పట్టణాల్లో చదువుకున్న వాళ్లే ఇలాంటి మోసాల బారిన పడి మోసపోతూ ఉండటం గమనార్హం. హైదరాబాద్ లోని మోతీ నగర్ లో ఒక యువతి వాడుతున్న యాప్ కు గుర్తు తెలియని ఖాతా యాడ్ కావడంతో 98,000 రూపాయలు బదిలీ అయింది.
Also Read: పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ తప్పు చేస్తే పెన్షన్ కట్..!
సదరు యువతి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగరంలో కొబ్బరి బోండాలు విక్రయించే మరో మహిళ ఖాతాలో సైతం ఇదే విధంగా 73,000 రూపాయలు మాయమయ్యాయి. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ప్రజలు మోసపోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనల గురించి కేసులు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రముఖ వైద్యుల ఖాతాల నుంచి కూడా ఈ విధంగా నగదు మాయమైందని తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాలకు నగదు బదిలీ అవుతుండటంతో బాధితులు సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. తాము ఏ తప్పు చేయకపోయినా నగదు బదిలీ అవుతూ ఉండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కష్టార్జితాన్ని క్షణాల్లో కేటుగాళ్లు మాయం చేస్తూ ఉండటంతో ఎవరికీ చెప్పుకోలేక బాధ పడుతున్నారు.
Also Read: భారత్ లో బంగారానికి తగ్గిన డిమాండ్.. కారణాలేమిటంటే..?
అయితే మరి కొంతమంది బాధితులు నగదు మాయమైనా ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రజలు యాప్ లు వాడే విషయంలో జాగ్రత్త వహించాలని అపరిచితులకు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఎటువంటి సమాచారం చెప్పవద్దని, యూపీఐ యాప్ లకు సంబంధించిన వివరాలను పంచుకోవద్దని సూచిస్తున్నారు.