https://oktelugu.com/

అమెరికాలో దూసుకెళ్తున్న ట్రంప్ : మళ్లీ ఆయనకేనా..?

అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో ట్రంప్ దూసుకుపోతున్నాడు. క్షణం క్షణం మారుతున్న ఫలితాల్లో ట్రంప్ ఆధిక్యతలోకి వచ్చేశారు. తాజా ఫలితాలను భట్టి చూస్తే 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ ఆధిపత్యం కొనసాగించినా ఆ తరువాత పరిణామాలు మారుతున్నాయి. అధ్యక్షుడిని నిర్ణయించే మరో కీలక రాష్ట్రం ఫ్లోరిడాలో ట్రంప్ ఆధిక్యత కోనసాగుతోంది. మిగితా స్టేట్స్ లోనూ ట్రంప్ కే ఆధిక్యత ఉంటోంది. జార్జియా, టెక్సాస్ లో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 4, 2020 11:54 am
    Follow us on

    అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో ట్రంప్ దూసుకుపోతున్నాడు. క్షణం క్షణం మారుతున్న ఫలితాల్లో ట్రంప్ ఆధిక్యతలోకి వచ్చేశారు. తాజా ఫలితాలను భట్టి చూస్తే 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ ఆధిపత్యం కొనసాగించినా ఆ తరువాత పరిణామాలు మారుతున్నాయి. అధ్యక్షుడిని నిర్ణయించే మరో కీలక రాష్ట్రం ఫ్లోరిడాలో ట్రంప్ ఆధిక్యత కోనసాగుతోంది. మిగితా స్టేట్స్ లోనూ ట్రంప్ కే ఆధిక్యత ఉంటోంది. జార్జియా, టెక్సాస్ లో ట్రంప్ బైడెన ను మించిపోయారు. ట్రంప్ ను అందనంత దూరంలో బైడెన్ ఉండడంతో మళ్లీ ట్రంప్ నకే పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బైడెన్ ఇప్పటి వరకు 13 రాష్ట్రాల్లో విజయం సాధించారు. 131 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ట్రంప్ నకు మాత్రం 92 వచ్చాయి. అయితే చివరి ఫలితం వరకు తారుమారయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.