Homeజాతీయం - అంతర్జాతీయంనేను రెడీ : రాహుల్ గాంధీ

నేను రెడీ : రాహుల్ గాంధీ

Rahul Gandhi

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ శ్రేణులకు సంతోషం కలిగించే మాట చెప్పారు. తాను పార్టీ చెప్పినట్లుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీ సీనియర్లతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయం చెప్పినట్లు ఆ పార్టీ నేత పవన్ బన్సల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ లేఖ రాసిన సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు. సోనియా గాంధీ నివాసం 10, జన్‌పథ్‌లో శనివారం జరిగిన సమావేశంలో సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ‘అసమ్మతివాద’ సీనియర్ నేతలు పాల్గొన్నారు. నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ బన్సల్ మాట్లాడుతూ, పార్టీ చెప్పినట్లుగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version