Homeఅత్యంత ప్రజాదరణగ్రేటర్లో గెలుపొటములు డిసైడ్ చేసేది ‘మాస్’ ఓటర్లేనా?

గ్రేటర్లో గెలుపొటములు డిసైడ్ చేసేది ‘మాస్’ ఓటర్లేనా?

GHMC Voting
గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు నేటి సాయంత్రానికి సంపూర్ణంగా ముగియనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు గాను డిసెంబర్ 1న 149 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఇక మిలిగిన ఒక్క స్థానానికి నేడు పోలింగ్ జరుగుతోంది. నేటి సాయంత్రం 6గంటలతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెరపడనుంది.

రేపు(డిసెంబర్ 4న) ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29శాతం పోలింగ్ నమోదుకాగా 2020లో 45.70శాతంగా నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.

Also Read: కవితకు మంత్రి పదవి ఖాయమే.!

గతంలో మాదిరిగానే పోలింగ్ శాతం నమోదుకావడంతో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటర్లు తీర్పు ఇస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ఓటింగ్ పెరగగా నగరంలో మాత్రం ఓటింగ్ తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలే ఓటుహక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.

ఏ పార్టీ గెలిచినా తమకు ఒరిగేది ఏమిలేదని నిరాసక్తత వ్యక్తం చేస్తూనే మాస్ ఓటర్లు తమకున్న ఓటు హక్కును మాత్రం సద్వినియోగం చేసుకోవడం విశేషం. అన్ని డివిజన్లలోనూ మాస్ ఓటర్లే ఎక్కువగా ఓటింగులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరు ఎవరీ పక్షనా మొగ్గుచూపితే వారికే విజయావకాశాలు దక్కే అవకాశాలున్నాయి.

Also Read: జీహెచ్ఎంసీ కౌంటింగ్.. కేటీఆర్ బీ అలెర్ట్?

మాస్ ఏరియాల్లో తిరిగి ప్రచారం చేసిన నేతలకు ఇది బాగా కలిసొచ్చే అంశంగా కన్పిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పథకాలే తమ గెలిపిస్తాయని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇటీవల హైదరాబాద్లో వచ్చిన వరద వల్ల నష్టపోయింది కూడా ఎక్కువగా మాస్ ఏరియాలే. తాము ఇబ్బందులు పడుతుంటే ఎవరూ ఆదుకోలేదని బాధితులు ఆరోపించిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మాస్ ఓటర్లంతా ఎవరీ వైపు మొగ్గుచూపారనేది మాత్రం అంతుచిక్కడం లేదు. ఎలాగో రేపు రిజల్ట్ రానుండటంతో మాస్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది తేలడం ఖాయంగా కన్పిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

Comments are closed.

Exit mobile version