Homeజాతీయ వార్తలుVijay income tax case: తమిళ హీరో విజయ్ కు 1.50 కోట్లు జరిమానా...

Vijay income tax case: తమిళ హీరో విజయ్ కు 1.50 కోట్లు జరిమానా విధించిన మద్రాసు హైకోర్టు..కారణం ఏంటంటే!

Vijay income tax case: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) కి వివాదాలు ఒకటి పోతే ఒకటి వచ్చి మెడకు చుట్టుకుంటున్నాయి. గత ఏడాది కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. ఇది పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన హీరో గా నటించిన ‘జన నాయగన్’ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుపడింది. కారణం ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలు సమాజం లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి అనే. కోర్టు లో ప్రస్తుతం ఈ కేసు నడుస్తూ ఉంది. త్వరలోనే తుది తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆదాయ పన్ను కేసులో విజయ్ కి హై కోర్టు నుండి చుక్కెదురు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో హీరో విజయ్ పై ఐటీ అధికారులు రైడింగ్ చేశారు.
2015 నుండి 2016 వ ఆర్ధిక సంవత్సరానికి గానూ విజయ్ 1.5 కోట్ల రూపాయిల జరిమానా చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. దీనిపై 2022 వ సంవత్సరం లో విజయ్ మద్రాసు హై కోర్టు ని ఆశ్రయించాడు. గత నెలలో ఈ కేసు ని రిజర్వు చేసిన హై కోర్టు, ఇప్పుడు కొట్టివేస్తూ తుది తీర్పు ని ఇచ్చేసింది. 2015-2016 ఆర్ధిక సంవత్సరం కి గానూ విజయ్ 35 కోట్ల రూపాయిల ఆదాయాన్ని పొందారని, అందుకు సంబంధించిన పాత్రలను పరిశీలించగా, పులి చిత్రానికి ఆయన తీసుకున్న 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఆదాయం లో చూపించలేదని, ఆదాయ పన్ను శాఖ హై కోర్టుకు ఆధారాలతో సహా నివేదిక అందించింది. దేనిని సవాలు చేస్తూ విజయ్ మద్రాసు హై కోర్టుని ఆశ్రయించాడు. హై కోర్టు జడ్జి సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత విజయ్ కి ప్రతికూలంగా తీర్పు ని ఇస్తూ, ఆయన పిటీషన్ ని కొట్టిపారేసింది. అంటే విజయ్ ఇప్పుడు కచ్చితంగా కోటి 50 లక్షల జరిమానా కట్టాల్సిందే.
ఇక జన నాయగన్ విషయానికి వస్తే ఈ సినిమా తమిళనాడు లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకు విడుదలయ్యే సూచనలే కనిపించడం లేదు. సమాజం లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సన్నివేశాలు ఉన్నందునే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించిందని, సెన్సార్ బోర్డు సభ్యులు హై కోర్టుకు వివరణ ఇవ్వగా, హై కోర్టు కూడా అందుకు సమర్దించింది. దీంతో మేకర్స్ కి వేరే దారి లేకపోవడంతో ఈ చిత్రం లోని ఆ 20 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను తొలగించి, కొత్త కాపీ ని సెన్సార్ కి పంపే ఆలోచనలో ఉన్నారట. చూడాలి మరి ఈసారైనా సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని అంగీకరిస్తారా లేదా అనేది.
Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version