రజనీకాంత్ 2021కి ముందే అభిమానులకు న్యూయర్ గిప్ట్ ఇచ్చారు. డిసెంబర్ 31 పార్టీ ప్రకటన.. కార్యచరణ ప్రకటించనున్నట్లు రజనీకాంత్ తాజాగా ప్రకటించారు. 2021 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటన చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
తమిళనాడులో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపైనే చర్చ జరుగుతోంది. తమిళనాడులో డీఎంకే.. అన్నాడీఎంకే పార్టీల మధ్యే అధికారం చేతులు మారుతూ ఉంటుంది. కాంగ్రెస్.. బీజేపీ పోటీలో ఉన్నా తమిళనాడు ప్రజలు స్థానిక పార్టీలకే పట్టం కడుతుండటంతో జాతీయ పార్టీలు కేవలం నామమాత్రంగానే మిగిలుతున్నాయి.
తమిళనాడులో దివంగత సీఎం జయలలిత మరణంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో రజనీ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చకు తెరలేచింది. అయితే రజనీ మాత్రం రాజకీయ ఎంట్రీపై ప్రతీసారి దాటేవేసే ధోరణి అవలంభిస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా రాజకీయ ఎంట్రీపై స్పష్టమైన ప్రకటన చేశారు. తాను సీఎం అయ్యేందుకు రాజకీయాల్లో రావడం లేదని రజనీ స్పష్టం చేయడం గమనార్హం.