
అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం వల్ల ఒక్కరోజులోనే కోటీశ్వరులైన వాళ్లు చాలామంది ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక రైతును కూడా ఊహించని విధంగా అదృష్టం వరించింది. ఖరీదైన వజ్రం ఒక్కరోజులో రైతును కోటీశ్వరుడిని చేసింది. 14.98 క్యారెట్ల వజ్రం వల్ల ఆ రైతు జీవితమే పూర్తిగా మారిపోవడం గమనార్హం. దీంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read: చైనా మళ్లీ దుస్సాహసం.. సరిహద్దుల్లో కుట్ర
పూర్తి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పన్నా ప్రాంతంలో లఖన్ యాదవ్ అనే రైతు ఉండేవాడు. వ్యవసాయంపై ఆధారపడి అతని కుటుంబం జీవనం సాగించేది. అతను వ్యక్తిగత పనుల కోసం కొంత మొత్తం ఖర్చు చేసి ఒక స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. లీజుకు తీసుకున్న స్థలాన్ని చదును చేయించి అక్కడ ఉన్న రాళ్లను ఏరివేశాడు. అయితే అక్కడ ఒక రంగురాయి ఆ రైతుకు కనిపించగా ఆ రంగురాయి వజ్రమేమో అనే అనుమానం కలిగింది.
Also Read: తిరుపతి బైపోల్: పవన్, బీజేపీ పొత్తు పొడిచేలా లేదే?
ఆ రంగురాయిని తీసుకుని రైతు డిస్ట్రిక్ట్ డైమండ్ ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆ రంగురాయి వజ్రం అని తేలడంతో ఆ రైతు ఎంతో సంతోషంతో తన కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని తెలియజేశాడు. ఆ వజ్రాన్ని వేలం పాట వేయగా 60 లక్షల రూపాయలు పలికింది. ఒక్క వజ్రం వల్ల తన లైఫ్ ఒక్కసారిగా మారిపోయిందని ఆ రైతు చెబుతున్నాడు. 60 లక్షల రూపాయలను రైతు బ్యాంక్ అకౌంట్ లో జమ చేశాడు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో తన పిల్లలను మంచి చదువులు చదిస్తానని రైతు వెల్లడించారు. ఆ రైతు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ రైతు చాలా అదృష్టవంతుడని అందరూ అతనిని ప్రశంసిస్తున్నారు.