ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ‘మా వింత గాధ వినుమా’ తాజాగా విడుదలైంది. ఇప్పటివరకు ఓటీటీలో రిలీజైన అన్ని సినిమాల మాదిరిగానే ఈ మూవీ కూడా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేమ కథగా వచ్చిన ‘మా వింత గాధ వినుమా’ కేవలం ఒకవర్గం ప్రేక్షకులకు మాత్రం కనెక్ట్ అవుతుందని మిగతా వర్గాలకు పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చనే టాక్ విన్పిస్తోంది.
Also Read: నోరుతెరిచి సాయం అడిగిన సోనూ సూద్.. దేనికోసమంటే?
‘మావింత గాధ వినుమా’లో సిద్దు జొన్నలగడ్డ.. శీరత్‌కపూర్ జంటగా నటించారు. ఆదిత్య మండల దర్శకత్వం వహించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ మూవీని సంజయ్ రెడ్డి.. అనిల్ పల్లాల.. జి.సునీత.. కీర్తి చిలుకూరిలు సంయుక్తంగా నిర్మించారు. ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి.. ప్రగతి.. ఫిష్ వెంకట్.. కమల్ కామరాజ్, కల్పిక గణేష్ నటించారు.
సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథాంశంతో ‘మావింత గాధ వినుమా’ మూవీ తెరకెక్కింది. అయిదే దర్శకుడు కథను అనుకున్న తీయడంలో మాత్రం విఫలమైనట్లు కన్పించింది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే నేటి ప్రేమ తాలూకు కొన్ని బోల్డ్ సన్నివేశాలు.. ముఖ్యంగా సిద్ధు నటన ఆకట్టుకుంది. హీరోయిన్ గా నటించిన శీరత్‌కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది.
Also Read: పవన్ సినిమా నేరుగా ఓటీటీలోకి ?
అయితే కథా కథనాలు ఆసక్తికరంగా సాగక పోవడం.. మూవీలో సరైన ప్లో మిస్ అవ్వడంతో సినిమా కొంచెం బోర్ ఫీల్ కొడుతోంది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా రెండో భాగంలో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా అందంగా చూపించారు.
సినిమాలో రెండు పాటలు బాగున్నా… నేపధ్య సంగీతం పర్వాలేదనిస్తోంది. మిగతా నటీనటులు ఉన్నంతలో బాగానే అలరించచారు. మొత్తానికి ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతున్న అన్ని సినిమాలా మాదిరిగానే ‘మా వింత గాధ వినుమా’ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్