https://oktelugu.com/

‘కొమురంభీం’ ప్రభంజనం. టాలీవుడ్లో సరికొత్త రికార్డు సెట్ చేసిన ఎన్టీఆర్..!

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అత్యంత భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ను డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన బాణీలను అందిస్తున్నాడు. Also Read: నోరుతెరిచి సాయం అడిగిన సోనూ సూద్.. దేనికోసమంటే? ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. పాన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 / 10:33 AM IST
    Follow us on

    దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అత్యంత భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ను డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన బాణీలను అందిస్తున్నాడు.

    Also Read: నోరుతెరిచి సాయం అడిగిన సోనూ సూద్.. దేనికోసమంటే?

    ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్.. హాలీవుడ్ నటి ఓలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ యూట్యూబ్లో కొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెల్సిందే. చరణ్ టీజర్ తర్వాత విడుదలైన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ టీజర్ చివర్లో కొమురంభీంను ఓ వర్గానికి చెందిన టోపీతో చూపించడంతో కొన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

    Also Read: ‘మా వింత గాధ వినుమా’ రివ్యూ: హిట్టా.. ప్లాపా?

    ‘ఆర్ఆర్ఆర్’పై ఈ వివాదం.. విమర్శలు కొనసాగుతుండగానే ఎన్టీఆర్ టీజర్ మాత్రం టాలీవుడ్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. టాలీవుడ్లో వన్ మిలియన్ లైక్స్ సాధించిన తొలి టీజర్ గా రికార్డు సృష్టించింది. దీంతోపాటు ఫాస్టుగా ఒక లక్ష కామెంట్స్ సంపాదించిన టీజర్ గా రికార్డుగా సెట్ చేసింది. టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 30మిలియన్ వ్యూస్ సాధించిన తొలి టీజర్ రికార్డు సెట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డు వచ్చి చేరడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్