అమెరికా ఎన్నికల లెక్కతేలింది: జోబైడెన్ కు 306, ట్రంప్ కు 232 ఓట్లు

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ లేని ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే పోలింగ్‌ ముగిసి.. వచ్చిన రిజల్ట్‌తో జో బైడెన్‌ గెలుపు తీరాలకు చేరారు. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌‌ దాటి ఆయనే ప్రెసిడెంట్‌ పీఠం అధిష్టించనున్నారు. అయితే.. ఓ గెలుపు ఇంకా కొలిక్కివచ్చినట్లు కాదు. ఇంకా ఆ దేశంలో కౌంటింగ్‌ నడుస్తూనే ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో జోబైడెన్ కు ఆధిపత్యం రావడం విశేషం. Also Read: గ్రేటర్ ఫైట్: బీజేపీలో ‘ఆ నలుగురి’కి బాధ్యతలు.. అరిజోనా, జార్జియా […]

Written By: NARESH, Updated On : November 14, 2020 10:26 am
Follow us on

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ లేని ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే పోలింగ్‌ ముగిసి.. వచ్చిన రిజల్ట్‌తో జో బైడెన్‌ గెలుపు తీరాలకు చేరారు. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌‌ దాటి ఆయనే ప్రెసిడెంట్‌ పీఠం అధిష్టించనున్నారు. అయితే.. ఓ గెలుపు ఇంకా కొలిక్కివచ్చినట్లు కాదు. ఇంకా ఆ దేశంలో కౌంటింగ్‌ నడుస్తూనే ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో జోబైడెన్ కు ఆధిపత్యం రావడం విశేషం.

Also Read: గ్రేటర్ ఫైట్: బీజేపీలో ‘ఆ నలుగురి’కి బాధ్యతలు..

అరిజోనా, జార్జియా రాష్ట్రాల్లో బైడెన్ గెలుపొందడం విశేసం. ఇక జార్జియాలో బిల్ క్లింటన్ తర్వాత విజయం సాధించిన డెమొక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ నిలిచారు.

సుధీర్ఘంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల లెక్క తేలింది. నవంబర్ 3న జరిగిన అమెరికా ఎన్నికల్లో ఎవరు విజేతలనేది ఇప్పటికీ అధికారికంగా వెల్లడైంది. అమెరికాలోని మొత్తం 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు గాను డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ కు 306, ట్రంప్ కు 232 ఓట్లు దక్కించుకున్నట్టు అక్కడి మీడియా తెలిపింది.

Also Read: వాళ్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. తక్షణమే రూ.10 వేల సాయం..?

2016లో ట్రంప్ కు 306 ఓట్లు రాగా.. ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కు 232 ఓట్లే వచ్చి ఓడిపోయారు. ఇప్పుడు అచ్చం అలాగే జోబైడెన్ కు, ట్రంప్ కు రావడం విశేషంగా మారింది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు