Homeబిజినెస్OnePlus 13 Price: రూ.3000 తగ్గింపుతో ఈ వన్ ప్లస్ మొబైల్ కొనవచ్చు.. వెంటనే త్వరపడండి..

OnePlus 13 Price: రూ.3000 తగ్గింపుతో ఈ వన్ ప్లస్ మొబైల్ కొనవచ్చు.. వెంటనే త్వరపడండి..

OnePlus 13 Price: OnePlus కంపెనీ నుంచి మొబైల్ మార్కెట్లోకి వస్తుందంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ప్రీమియం మొబైల్స్ కొనాలని అనుకునేవారు ఈ కంపెనీ ఫోన్లపై ఆసక్తి చూపుతారు. ప్రీమియం ఫీచర్లు, నాణ్యమైన కెమెరా, బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో ఈ కంపెనీకి చెందిన ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల వన్ ప్లస్ కు చెందిన మొబైల్ పై తగ్గింపు ధరను ప్రకటించారు. గతంలో ఇది మార్కెట్లోకి వచ్చిన సమయంలో కొనలేని వారు ఇప్పుడు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఇది ఏ మొబైల్? దీని ధర ఎంత? ఆ వివరాల్లోకి వెళ్తే..

OnePlus 13 మొబైల్ 2024 నవంబర్ నెలలో మార్కెట్లోకి వచ్చింది. ఇది మార్కెట్లోకి వచ్చిన సమయంలో దీని ధర రూ.69,999 గా ఉండేది. అయితే ఆ తర్వాత దీనిని రూ.60,999 కి తగ్గించారు. ఇటీవల ఈ ఫోన్ కొనాలని అనుకునేవారు మరో రూ.3,000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు క్రెడిట్ కార్డులపై ఈ మొబైల్ కొనుగోలు చేస్తే ఈ తగ్గింపు ధర వర్తించే అవకాశం ఉంటుంది. గతంలో ఈ మొబైల్ కొనలేని వారు ఇప్పుడు దీనిని తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో ఉండే మెరుగైన ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ మొబైల్లో Qualcomm Snapdragon 8 Elite SoC అనే సాఫ్ట్వేర్ ఉండనుంది. ఈ సాఫ్ట్వేర్ తో మల్టీ టాస్కింగ్ యూజర్స్ కు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో గేమింగ్స్ ఉంటే వారికి గొప్ప అనుభూతి కలుగుతుంది. రోజువారి వినియోగదారుల సైతం ఇలాంటి మొబైల్ స్టోర్ తమ పనులను తొందరగా పూర్తి చేయగలుగుతారు.

వన్ ప్లస్ 13 మొబైల్ లో కెమెరా పని తీరు మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే అల్ట్రా వైడ్ సెన్సార్ కూడా ఇదే పిక్సెల్ తో పనిచేస్తుంది.3x వరకు జూమ్ చేసినా కూడా ఎలాంటి నాణ్యత తగ్గకుండా ఫోటోలను తీసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి ఈ కెమెరా ప్రత్యేకంగా ఉండనుంది. ఈ మొబైల్ లో 6.8 టు అంగుళాల AMOLED డిస్ప్లే చూడొచ్చు. దీన్ని స్క్రీన్ పెద్దదిగా ఉండడంతో మూవీస్ చూసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం లోనైనా ఖచ్చితమైన రంగులతో ప్రకాశవంతంగా ఉండనుంది.

ఈ మొబైల్ లో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా అనుకోవచ్చు. ఇందులో 6000 mAh బ్యాటరీని ఉంచారు. ఇది 100 W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది.50 W వైర్లెస్ చార్జింగ్ మద్దతుగా ఉండలని ఉంది. ఇప్పటికే వన్ ప్లస్ మొబైల్ కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. అయితే ఇలాంటి సమయంలో వన్ ప్లస్ 13 ధర తగ్గింపుతో సేల్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version