https://oktelugu.com/

మన దేశంలో ఈ ఏడాది తొలి గ్రహణం ఎప్పుడంటే..?

మనలో చాలామంది పుస్తకాల్లో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం గురించి చదివి ఉంటారు. గ్రహణం రోజున కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే నెల 26వ తేదీన తొలి గ్రహణం రాబోతుంది. ఈ ఏడాది మొదట చంద్ర గ్రహణం వస్తుండగా గ్రహణం రోజున పూజలు కాని శుభకార్యాలు కానీ నిర్వహించకూడదు. చంద్రుడు సూర్యునికి మధ్య భూమి అడ్డుగా వస్తే చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మన దేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణ కాలాన్ని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 21, 2021 / 06:26 PM IST
    Follow us on

    మనలో చాలామంది పుస్తకాల్లో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం గురించి చదివి ఉంటారు. గ్రహణం రోజున కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే నెల 26వ తేదీన తొలి గ్రహణం రాబోతుంది. ఈ ఏడాది మొదట చంద్ర గ్రహణం వస్తుండగా గ్రహణం రోజున పూజలు కాని శుభకార్యాలు కానీ నిర్వహించకూడదు. చంద్రుడు సూర్యునికి మధ్య భూమి అడ్డుగా వస్తే చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

    మన దేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణ కాలాన్ని సూతక కాలం అని పిలుస్తారు. గ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల మునుపే సూతక కాలం ప్రారంభమవుతుంది. గ్రహణం ఏ సమయంలో ముగుస్తుందో ఆ సమయంలోనే సూతక కాలం కూడా ముగుస్తుంది. తొలి చంద్ర గ్రహణం మన దేశంలో పాక్షికంగా కనిపించనుండటం గమనార్హం. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, పసిఫిక్ మహాసముద్రం దగ్గర ఈ గ్రహణం ఏర్పడనుంది.

    దాదాపు 14 నిమిషాల పాటు ఈ చంద్ర గ్రహణం ఏర్పడనుండగా భారత్ లో ఏర్పడే చంద్ర గ్రహణాన్ని పెనుంబ్రాల్ చంద్రగ్రహణం అని పిలుస్తారు. ఈ చంద్ర గ్రహణం మే నెల 26వ తేదీన రాత్రి 7 గంటల 14 నిమిషాలకు ప్రారంభమై 7 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మన దేశంపై గ్రహణ ప్రభావం ఉండటం గమనార్హం. చంద్రుడు పాక్షికంగా మాత్రమే కనిపించినా గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

    తొలి చంద్రగ్రహణం మేలో ఏర్పడనుండగా రెండో చంద్ర గ్రహణం 2021 సంవత్సరం నవంబర్ 28న ఏర్పడనుంది. రెండో చంద్ర గ్రహణం ప్రభావం మన దేశంతో పాటు ఉత్తర ఐరోపా, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, అమెరికాలపై ఉండనుంది.