
కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. బెంగుళూరులో ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందిజ. వారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉన్నారు. 9 నుంచి 19 ఏళ్ల వారిలో 136 మంది వైరస్ బారినపడ్డారు. కొవిడ్ థర్డ్ వేవ్ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తోన్న ఈ తరుణంలో ఇలా తక్కువ వ్యవధిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు కొవిడ్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.