Homeఅత్యంత ప్రజాదరణKota Srinivasa Rao: ఇలాంటివి చేసే కంటే.. వ్యభిచారం చేసి బతకొచ్చు కదా...

Kota Srinivasa Rao: ఇలాంటివి చేసే కంటే.. వ్యభిచారం చేసి బతకొచ్చు కదా !

Kota Srinivasa Rao: Shared His Memories About Jambalakidipamba Movie

Kota Srinivasa Rao: కోట శ్రీనివాస రావు నేటి మహా నటుడు. వందల సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు. ఒక కమెడియన్‌ గా, విలన్‌ గా గత నాలుగు దశాబ్దాలుగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆయన నటనకు పలు అవార్డులు కూడా దాసోహం అయ్యాయి. ఇక ఆయన నటనా జీవితంలో ఎన్నో మరపురాని సంఘటనలు, అలాగే మరెన్నో అవమానకర సంఘటనలు కూడా ఉన్నాయి.

కోట గారు ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. అప్పటి జ్ఞాపకాలను, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటున్న క్రమంలో కోట తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవి ‘జంబలకిడిపంబ’ సినిమా చేస్తోన్న రోజులు. కేవలం 50 లక్షల రుపాయల బడ్జెట్‌ తో ఆ సినిమాను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చాలా గొప్పగా తీశారు.

ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు లాగా, మగవాళ్ళు ఆడవాళ్ళు లాగా మారతారు ఆ సినిమాలో. అయితే, దర్శకుడు ఈవీవీ గారు ఓ రోజు కోట గారిని కూర్చోబెట్టి కథ చెప్పారు. కథ కోట గారికి ఆసక్తిగా అనిపించింది. అయితే, సినిమాలో కోట గారితో పాటు మిగిలిన స్టార్ కమెడియన్స్ కూడా ఓ 15 రోజులు పాటు విశాఖపట్నం వీధుల్లో మంగళసూత్రం మెడలో వేసుకొని తిరగాలి.

కాగా, ఈ విషయం గురించి తెలిసిన ఓ స్టార్ డైరెక్టర్, ‘ఇలాంటి చెత్త చిత్రాలు చేసే కంటే.. వ్యభిచారం చేసి బతకొచ్చు కదా’ అంటూ విమర్శించారు. అది దర్శకుడు ఈవీవీ గారికి తెలిసింది. ఆ విషయాన్ని ఆయన కోట గారితో చెప్పుకుని చాలా బాధపడ్డారట.

ఐతే కోట గారు మాత్రం, ఈవీవీ గారితో ‘ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. మీరు బాధ పడాల్సిన పని లేదని’ దైర్యం చెప్పారట. ఆయన చెప్పినట్లుగానే చివరకు సినిమా రిలీజ్ అయి, అద్భుతమైన విజయాన్ని సాధించింది. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా షాకయ్యారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version