Revanth Reddy: రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ దండయాత్ర.. ఘర్షణ.. దాడులు

Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డ్రగ్స్ కేసులో రెండు పార్టీలు చెలరేగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భౌతిక దాడులకు సైతం ప్రేరేపిస్తోంది. ఈ నేపథ్యంలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో అట్టడుకుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్ కు టీఆర్ఎస్ సైతం సమాధానం చెబుతోంది. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. అనవసరంగా అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని […]

Written By: Srinivas, Updated On : September 21, 2021 6:32 pm
Follow us on

Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డ్రగ్స్ కేసులో రెండు పార్టీలు చెలరేగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భౌతిక దాడులకు సైతం ప్రేరేపిస్తోంది. ఈ నేపథ్యంలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో అట్టడుకుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్ కు టీఆర్ఎస్ సైతం సమాధానం చెబుతోంది. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. అనవసరంగా అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని ముట్టడించేందకుు ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు ఇరువర్గానలు చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు రాళ్తతో దాడులు చేసుకున్నారు.

పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయినా వినకపోవడంతో లాఠీచార్జీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అడ్డుకున్నారు. మొత్తానికి గొడవ సద్దుమణిగినా మళ్లీ ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి నివాసాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రగ్స్ కేసులో వివాదం పెరుగుతోంది. చిలికిచిలికి గాలివానలా మారుతోంది.

డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మంత్రి కేటీఆర్ ఆగ్రహం చేస్తున్నారు. ప్రతిష్టగా బావించి ఆయనపై పరువు నష్టం దావా వేసే వరకు వెళ్లారు. దీంతో తెలంగాణలో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది.