ఒకవైపు డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్.. హాట్ ఫెవరేట్ టీమ్ ముంబయి ఇండియన్స్. మరోవైపు.. ఫస్ట్‌మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య మరికొద్ది గంటల్లో ఐదో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మరోసారి ఐపీఎల్‌లో ఆకట్టుకొని.. హ్యాట్రిక్ సాధిస్తుందని ఎన్నో హోప్స్‌తో ఉన్న ముంబయి ఇండియన్స్ అభిమానులను ఆ జట్టు మొదటి మ్యాచ్‌లోనే నిరాశపరిచింది. నేటి మ్యాచ్‌లో కోల్‌కతా పై గెలుపొంది ఖాతా తెరవాలని చూస్తోంది. అయితే.. ముంబయిని కూడా ఓడించి.. తన ఖాతాలో రెండో విజయాన్ని వేసుకోవాలని కోల్‌కతా జట్టు కూడా ఆరాటపడుతోంది.
ముంబయి ఇండియన్స్, కోల్‌కతా జట్లు సోమవారం తలపడనున్న నేపథ్యంలో.. ముంబయి ఇండియన్స్ జట్టు మంచి బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, పాండ్య సోదరులు, సూర్యకుమార్, పొలార్డ్‌ల బ్యాటింగ్‌కు తిరుగులేదు. ఈ జట్టులో నంబర్ 7 వరకు కూడా అందరూ బ్యాట్స్‌మెన్లే. అంతేకాదు.. బౌలర్లకూ ఈ జట్టులో ఎలాంటి కొదవలేదు.
ముంబై ఇండియన్స్ బౌలర్లు కేకేఆర్ బ్యాటింగ్‌కు సులభంగా చెక్ పెట్టే అవకాశాలూ లేకపోలేదు. బుమ్రా, పాండ్య సోదరులు, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, క్రిస్ లిన్ వంటి బౌలర్లతో ముంబై ఇండియన్స్‌కు విజయం సులభం. అయితే.. ఇంత బలమైన జట్టు మొదటి మ్యాచ్‌లో ఎందుకు విఫలమైందో అందరికీ అంతుబట్టని అంశం.
ఇక కేకేఈఆర్ జట్టు విషయానికొస్తే.. బ్యాటింగ్ క్రమంలో ఆండ్రూ రస్సెల్, ఇయాన్ మోర్గాన్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, షుబ్మాన్ గిల్‌లతో జట్టు బలంగా కనిపిస్తున్నా ముంబయి ఇండియన్స్ ధాటిని తట్టుకొని నిలుస్తుందా అని ఆశ్చర్యకరంగా మారింది. అయినప్పటికీ జట్టు ఎప్పుడూ ఫామ్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రదర్శనలో స్థిరత్వం లేదు. ఎవరు క్లిక్ చేస్తారు.. ఎవరు చేయరు అని తెలియకుండా ఉంది. కేకేఈఆర్ బౌలింగ్ కూడా బాగుంది. కానీ.. వారు డెత్ ఓవర్లలో ఆర్థిక వ్యవస్థను కొనసాగించాలి. వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్‌లో సానుకూల ముద్ర వేయలేకపోయాడు. షకీబ్ అల్ హసన్, రస్సెల్ కూడా విఫలమయ్యారు. అందుకే.. బౌలింగ్‌పై ఇంకొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా.. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, కేకేఈఆర్ 27 మ్యాచ్‌ల్లో తలపడగా.. 21 మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియన్స్, ఆరు మ్యాచ్‌ల్లో కేకేఈఆర్ విజయం సాధించింది.