‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో మొదలైన పూరీ జగన్నాథ్ – ఛార్మి జర్నీ.. రాను రానూ మరింత క్లోజ్ అయ్యింది. దీంతో.. వీళ్లిద్దరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తోందనే పుకార్లు షికారు చేయడం మొదలు పెట్టాయి. సంవత్సరాలు గడుస్తున్నా.. గుసగుసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటకీ.. వాళ్లు నో అని చెప్పిందీ లేదు. అవునని చెప్పిందీ లేదు. దీంతో.. జనాలు ఎవరికి తెలిసిన సినిమాను వాళ్లు చూపించేస్తున్నారు.
అయితే.. ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగానే ప్రవర్తిస్తున్నారు వీరిద్దరూ. హీరోయిన్ గా ఫేడ్ ఔట్ అయిన తర్వాత పూరీకి మరింత దగ్గరైంది చార్మి. వీరిద్దరూ కలిసి నిర్మాణ సంస్థలను మొదలు పెట్టి.. సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ స్థాపించిన వీరిద్దరూ.. ఇప్పటి వరకూ పలు చిత్రాలను నిర్మించారు. మూడు పదుల వయసు ఎప్పుడో దాటిన చార్మి.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. పైగా సినిమా నిర్మాణాల పేరుతో పూరీకి దగ్గరగానే ఉంటోంది.
ఆ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా వీళ్లిద్దరూ నిర్మించిందే. అదేవిధంగా.. విజయ్ దేవరకొండతో పూరీ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ సినిమా కూడా వీళ్ల ఫ్యాక్టరీ నుంచే వస్తోంది. అటు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ చిత్రం కూడా వీళ్లే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విధంగా నిర్మాణ పనులు చక్కబెడుతూ.. పూరీ పక్కనే ఉంటోంది చార్మి.
దీంతో.. విషయం ముదురుతోందని భావించిన పూరీ భార్య లావణ్య.. ఈ మధ్య చార్మిపై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. అంతేకాదు.. ఛార్మికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధం చూశారని తెలియడంతో.. వెంటనే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కూడా చెప్పిందట. మరి, ఇందులో వాస్తవం ఎంతో తెలియదుగానీ.. ఫిల్మ్ నగర్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.