https://oktelugu.com/

రైతు చట్టాలకు వ్యతిరేకించిన సీఎం విజయన్..!

కేంద్రంలోని మోదీ సర్కార్ గత పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణల పేరిట మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా ఉత్తరాది రైతులు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. Also Read: కేసీఆర్‌‌ యూటర్న్‌ వెనుక అసలు కారణం అదేనా..! పంజాబ్ రైతులు మొదలెట్టిన రైతు ఉద్యమంలో క్రమంగా హర్యానా.. యూపీ రైతులు చేరారు. ఈక్రమంలోనే రైతులతో పలుమార్లు కేంద్రం చర్చలు జరిపింది. చర్చలు జరుగుతుండగానే రైతులు సంఘాలు డిసెంబర్ 8న భారత్ బంద్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 31, 2020 / 02:32 PM IST
    Follow us on

    కేంద్రంలోని మోదీ సర్కార్ గత పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణల పేరిట మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా ఉత్తరాది రైతులు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు.

    Also Read: కేసీఆర్‌‌ యూటర్న్‌ వెనుక అసలు కారణం అదేనా..!

    పంజాబ్ రైతులు మొదలెట్టిన రైతు ఉద్యమంలో క్రమంగా హర్యానా.. యూపీ రైతులు చేరారు. ఈక్రమంలోనే రైతులతో పలుమార్లు కేంద్రం చర్చలు జరిపింది.

    చర్చలు జరుగుతుండగానే రైతులు సంఘాలు డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమానికి దేశ్యావ్యాప్తంగా అన్నివర్గాల నుంచి మద్దతు లభించింది.

    అన్ని రాజకీయ పార్టీలు.. సెలబెట్రీలు.. సామాన్యుల నుంచి రైతులకు పూర్తిస్థాయి మద్దతు లభిస్తోంది. దీంతో రైతులు సైతం ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

    ఢిల్లీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే 32మంది రైతులు మృతిచెందాడం శోచనీయంగా మారింది.

    ఈక్రమంలోనే పలు రాష్ట్రాలు రైతులకు మద్దతుగా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తున్నాయి. ఇటీవలే ఢిల్లీ సీఎం క్రేజీవాల్ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు.

    Also Read: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..?

    అసెంబ్లీలోనే ఆప్ నేతలు వ్యవసాయ ప్రతులను చించివేసి రైతులకు మద్దతు తీర్మానం చేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఢిల్లీ కంటే ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్.. రాజస్థాన్ అసెంబ్లీ తీర్మానాలు చేశాయి. ఇక తాజాగా కేరళ అసెంబ్లీ కూడా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయి.

    కేరళ అసెంబ్లీ గురువారం ప్రత్యేకంగా సమావేశమైంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై చర్చించారు. అనంతరం ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ సీఎం పినరయ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్