https://oktelugu.com/

పెంపుడు పిల్లికి సీమంతం చేసిన మహిళ.. ఎందుకంటే..?

సాధారణంగా పుట్టబోయే బిడ్డ దీర్ఘాయువుతో పుట్టాలని.. తల్లి మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండాలని సీమంతం వేడుకను చేస్తారు. గర్భంతో ఉన్న మహిళలకు సీమంతం వేడుక కలిగించే సంతోషం అంతాఇంతా కాదు. అయితే ఒక మహిళ మాత్రం తను పెంచుకునే పెంపుడు పిల్లికి సీమంతం చేసింది. మనుషులకైనా, జంతువులకైనా మాతృత్వపు అనుభూతి ఒకేలా ఉంటుందని భావించిన మహిళ పిల్లికి ఘనంగా సీమంతం వేడుక జరిపించింది. Also Read: షాకింగ్: దేశ ప్రధానిపై బాంబు దాడి.. 26మంది మృతి చెన్నై […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2020 / 02:35 PM IST
    Follow us on

    సాధారణంగా పుట్టబోయే బిడ్డ దీర్ఘాయువుతో పుట్టాలని.. తల్లి మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండాలని సీమంతం వేడుకను చేస్తారు. గర్భంతో ఉన్న మహిళలకు సీమంతం వేడుక కలిగించే సంతోషం అంతాఇంతా కాదు. అయితే ఒక మహిళ మాత్రం తను పెంచుకునే పెంపుడు పిల్లికి సీమంతం చేసింది. మనుషులకైనా, జంతువులకైనా మాతృత్వపు అనుభూతి ఒకేలా ఉంటుందని భావించిన మహిళ పిల్లికి ఘనంగా సీమంతం వేడుక జరిపించింది.

    Also Read: షాకింగ్: దేశ ప్రధానిపై బాంబు దాడి.. 26మంది మృతి

    చెన్నై నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే చెన్నై నగరంలోని తిరువేర్కాడు స్వామి నటేశనార్‌ నగర్‌ లో శివగామి, జ్యోతికుమార్ దంపతులు నివశిస్తున్నారు. వాళ్లింట్లో ఉండే పెంపుడు పిల్లికి రియా అని ముద్దు పేరు పెట్టుకున్నారు. ఇటీవల ఆ పిల్లి గర్భం దాల్చగా శివగామి ఆ పిల్లికి సీమంతం జరపాలని భావించారు. పిల్లి సీమంతం వేడుకకు రావాలని బంధువులను, సన్నిహితులను ఆహ్వానించారు.

    Also Read: కరోనా వేళ మెట్రోలో కిస్సులతో జంటల లీల

    మంగళవారం రోజు రాత్రి శివగామి పిల్లికి ఇష్టమైన సీమంతం వేడుక చేశారు. పిల్లికి చేపలు, రొయ్యలు, చికెన్ ఇష్టం కాగా వాటిని పిల్లికి ఆహ్వానించారు. సీమంతం వేడుకలో పాల్గొన్న మహిళలు పిల్లికి నుదుటిపై కుంకుమ పెట్టి ఆహ్వానించారు. పిల్లికి సీమంతం వేడుక జరపడం గురించి శివగామి భర్త జ్యోతి కుమార్ మాట్లాడుతూ తమకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం అని తెలిపారు.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    తమ ఇంట్లో రెండు కుక్కలు, ఒక పిల్లిని పెంచుకుంటున్నామని గతంలో మగ కుక్కులకు కూడా పుట్టినరోజు వేడుకను జరిపామని చెప్పారు. పెంపుడు జంతువుల ప్రత్యేకమైన రోజుల్లో వేడుకలను నిర్వహించడం తమకు ఇష్టమని వెల్లడించారు.