https://oktelugu.com/

కేసీఆర్‌‌ యూటర్న్‌ వెనుక అసలు కారణం అదేనా..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఏ నిర్ణయం తీసుకున్నా దానికో లెక్కుంటది. ఎందుకంటే.. ఏదీ ఆలోచించకుండా నిర్ణయం చేయరనేది అందరికీ తెలుసు. రాజకీయాల్లోనూ ఆయన అపరచాణక్యుడు అనే చెప్పాలి. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి.. అధికార పక్షాన్ని ఎలా కంట్రోల్‌లో పెట్టాలో బాగా తెలిసిన వ్యక్తి. అయితే.. రాష్ట్రంలో కేసీఆర్‌‌ తీసుకుంటున్న నిర్ణయాలు కాస్త బెడిసికొడుతున్నాయి. ఫలితంగా అటు పార్టీపై, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఆ వ్యతిరేకతను బీజేపీ వైపు మళ్లించేందుకు మరో ఎత్తు వేస్తున్నట్లుగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 31, 2020 / 02:28 PM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఏ నిర్ణయం తీసుకున్నా దానికో లెక్కుంటది. ఎందుకంటే.. ఏదీ ఆలోచించకుండా నిర్ణయం చేయరనేది అందరికీ తెలుసు. రాజకీయాల్లోనూ ఆయన అపరచాణక్యుడు అనే చెప్పాలి. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి.. అధికార పక్షాన్ని ఎలా కంట్రోల్‌లో పెట్టాలో బాగా తెలిసిన వ్యక్తి. అయితే.. రాష్ట్రంలో కేసీఆర్‌‌ తీసుకుంటున్న నిర్ణయాలు కాస్త బెడిసికొడుతున్నాయి. ఫలితంగా అటు పార్టీపై, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఆ వ్యతిరేకతను బీజేపీ వైపు మళ్లించేందుకు మరో ఎత్తు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

    Also Read: కేసీఆర్‌‌ వరాల వెనుక అసలు కుట్ర అది..: విజయశాంతి ఫైర్‌‌

    ప్రస్తుతం తెలంగాణలో తమ రాజకీయ శత్రువుగా బీజేపీ తయారైంది. టీఆర్‌‌ఎస్‌నే పూర్తి టార్గెట్ చేసిన బీజేపీకి సరైన రీతిలో గుణపాఠం చెప్పాలని కేసీఆర్‌‌ భావిస్తున్నారు. దీని కోసమే సరికొత్త రాజకీయానికి తెరతీశారు. తెలంగాణలో వ్యవసాయ సంస్కరణలపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యతిరేకత తనపైకి రాకుండా చేసుకునేందుకు కేసీఆర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు.

    ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావంతో రైతులు పంట అమ్ముకునేందుకు ఇబ్బంది పడకుండా, ప్రభుత్వం గ్రామాల్లోనే పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ.. ప్రతిసారి ఆ విధంగా చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. అలా చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని, రైస్ మిల్లర్లు, పప్పుల మిల్లర్లు కొనుగోలు చేసినట్లుగా ప్రభుత్వం అమ్మకాలు, కొనుగోలు చేయడం సాధ్యం కాదని, వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా లేదని యూటర్న్‌ తీసుకుంది.

    Also Read: న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఆగ్రహం..!

    మరోవైపు.. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతుండడంతో ప్రభుత్వం గ్రామాలలో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వస్తున్న తరుణంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టాల కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రచారం చేసుకోవాలని టీఆర్ఎస్ డిసైడ్ అయినట్లుంది. దీని ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా, తాము తీసుకున్న నిర్ణయాల కారణంగా బీజేపీ చిక్కుల్లో పడే విధంగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్‌‌ ఆలోచనల ప్రకారం తెలంగాణలో బీజేపీ హవా తగ్గించాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్