https://oktelugu.com/

వ్యవసాయ చట్టాల ప్రతులను కేజ్రీవాల్ ఎందుకు చించేశారంటే?

కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణ పేరిట కొత్తగా మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. అయితే వీటిని వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా రైతులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. రైతుల మద్దతుకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. Also Read: ఇంటర్ పాసైన వాళ్లకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు గడువు పొడిగింపు..? ఢిల్లీలో వణికించే చలిలోనూ రైతులు దీక్షలు చేస్తుండటంతో పలు రాజకీయ పార్టీల నాయకులు వారికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 17, 2020 / 09:24 PM IST
    Follow us on

    కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ సంస్కరణ పేరిట కొత్తగా మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. అయితే వీటిని వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా రైతులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. రైతుల మద్దతుకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.

    Also Read: ఇంటర్ పాసైన వాళ్లకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు గడువు పొడిగింపు..?

    ఢిల్లీలో వణికించే చలిలోనూ రైతులు దీక్షలు చేస్తుండటంతో పలు రాజకీయ పార్టీల నాయకులు వారికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం రైతులకు పలుమార్లు మద్దతు ప్రకటించారు. భారత్ బంద్ సమయంలోనూ అరవింద్ కేజ్రీవాల్ వారికి మద్దతు ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేసిన సంగతి తెల్సిందే.

    అదేవిధంగా రైతులకు మద్దతుగా ఒక్కరోజు దీక్షలోనూ అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఇక తాజాగా రైతులు చేస్తున్న దీక్షపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అరవింద్ క్రేజీవాల్ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

    Also Read: మోడీ సర్కార్ కు షాక్.. వ్యవసాయ చట్టాల అమలు ఆపాలన్న సుప్రీంకోర్టు

    కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇంత అత్యవసరంగా వ్యవసాయ చట్టాలను ఎందుకు తీసుకొచ్చిందని ప్రశ్నించారు. మోదీ సర్కార్ బ్రిటిషన్ల కంటే చెత్తగా మారకూడదని సూచించారు. ఈక్రమంలోనే కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను కేజ్రీవాల్ అసెంబ్లీలో చించేశారు.

    అంతకముందు ఆప్ ఎమ్మెల్సీలు సైతం చట్టం ప్రతులను చించేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆప్ విడుదల చేసింది. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో కేంద్రం చట్టాలను వ్యతిరేకించిన మూడో రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. అంతకు ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్.. రాజస్థాన్ అసెంబ్లీ తీర్మానాలు చేశాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్