Also Read: చంద్రబాబు సంచలనం: మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే రాజకీయ సన్యాసం
కరోనా వ్యాక్సిన్ ఏమి మంత్రం దండంకాదని.. ముందుజాగ్రత్తలే అందరికీ శ్రీరామ రక్ష అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరికీ వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ మన చుట్టున్న వారిని సురక్షితంగా ఉండేలా దోహదపడాలని సూచించింది.
అదేవిధంగా ఓ వర్చువల్ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ తకేషి కసాయ్ మాట్లాడుతూ వైద్య నిపుణుల సలహాలు.. సూచనలు పాటించడం ద్వారా 2021 సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోగలుగుతామని చెప్పారు. ఏడాదిపాటు అవిశ్రాంతంగా పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల గురించి ప్రతీఒక్కరూ ఆలోచించాలన్నారు.
Also Read: ఏపీ ప్రజలపై వరాలకు జగన్ రెడీ!
వ్యాక్సిన్ కనుగోనడం సైంటిస్టులకు ఓ సవాల్ అయితే.. దానిని ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయడం మరో పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు. ప్రతీఒక్కరు సామాజిక దూరం.. మాస్కులు ధరించడం.. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలను పాటించాలని సూచించారు.
డబ్ల్యూహెచ్ఓ రీజినల్ ఎమర్జెన్సీ డైరెక్టర్ ఎకోడ్ కసాయ్ సైతం కరోనా వ్యాక్సిన్ మంత్రదండం కాదని తేల్చిచెప్పారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే యువత ప్రజారోగ్య రక్షణ విషయంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్