https://oktelugu.com/

బీజేపీకి బంపరాఫర్ ఇస్తున్న కేసీఆర్.. వ్యూహంలో భాగమేనా?

మొన్న జరిగిన దుబ్బాక.. నిన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్.. బీజేపీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ హోరాహోరీ ప్రచారం చేసి విజయం సాధించింది. దుబ్బాక.. గ్రేటర్లో టీఆర్ఎస్ దూకుడు చెక్ పెట్టి తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించింది. Also Read: కేసీఆర్ ఫ్యామిలీలో కొత్త మార్పు.. గమనించారా? తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేంద్రంతో ఫైట్ సిద్ధమయ్యారు. భారత్ బంద్ నేపథ్యంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 / 01:55 PM IST
    Follow us on

    మొన్న జరిగిన దుబ్బాక.. నిన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్.. బీజేపీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ హోరాహోరీ ప్రచారం చేసి విజయం సాధించింది. దుబ్బాక.. గ్రేటర్లో టీఆర్ఎస్ దూకుడు చెక్ పెట్టి తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించింది.

    Also Read: కేసీఆర్ ఫ్యామిలీలో కొత్త మార్పు.. గమనించారా?

    తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేంద్రంతో ఫైట్ సిద్ధమయ్యారు. భారత్ బంద్ నేపథ్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించి కేంద్రంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ ఉన్నట్టుండి కేసీఆర్ ఢిల్లీ పయనమయ్యారు. వరుసగా కేంద్ర మంత్రులను.. ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు.

    రెండ్రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ నేడు హైదరాబాద్ కు తిరుగు పయమనయ్యారు. అయితే ఈ రెండ్రోజుల్లో సీఎం కేసీఆర్ బీజేపీ పెద్దలకు కలుసుకొని రాజకీయంగానూ చర్చించినట్లు టాక్ విన్పిస్తోంది. తెలంగాణలో బీజేపీ ఎదుగడంతో ఆ పార్టీని కట్టడి చేసేందుకు కేసీఆర్ సరికొత్త వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా గ్రేటర్ మేయర్ పీఠం బీజేపీకి ఇచ్చి డిప్యూటీ మేయర్ టీఆర్ఎస్ తీసుకోనేందుకు కేసీఆర్ అంగీకరించారనే టాక్ విన్పిస్తోంది.

    గ్రేటర్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు చెక్ పెట్టే అవకాశం ఉంది. కేంద్రంలోని బీజేపీకి లోక్ సభలోనూ ఎంపీ, రాజ్యసభ సభ్యుల సహకారం అవసరం ఉన్నందున టీఆర్ఎస్ సహకారం తీసుకునే అవకాశం ఉంది. తొలి నుంచి కేసీఆర్ కేసీఆర్ కేంద్రంతోనే సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ పై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ఢిల్లీ పర్యనలో కేంద్రాన్ని కేసీఆర్ ఏం కోరాడంటే..?

    బీజేపీ అధిష్టానం గ్రేటర్లో పొత్తుకు సిద్ధమైతే మాత్రం తెలంగాణలో బీజేపీ చేజేతుల అందివచ్చిన అవకాశాన్ని టీఆర్ఎస్ కు అప్పజెప్పినట్లే అవుతుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు పొత్తుకు అంగీకరించకపోవచ్చు. అయితే కేంద్రంలో టీఆర్ఎస్ ఎంపీల అవసరం బీజేపీకి ఉన్నందుకు అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    కేసీఆర్ బీజేపీకి ఇచ్చిన ఆఫర్ ఫలితాలు వస్తాయా? లేదా అనేది కేసీఆర్ హైదరాబాద్ వచ్చాక తేలే అవకాశం ఉంది. కేసీఆర్ నేడో రేపో యథావిధిగా బీజేపీపై ఫైర్ అయితే చర్చలు విఫలమైనట్లుగా.. లేదా బీజేపీకి సానుకూలంగా మాట్లాడితే మాత్రం ఆపార్టీతో  ఒప్పందం కుదిరినట్లే అనే స్పష్టం చేసుకోవచ్చు. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్