ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇటు ప్రభుత్వం.. అటు ఎన్నికల కమిషనర్ భీష్మించారు. తన పదవీ కాలంలోగా ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ ఈసీ నిమ్మగడ్డ పట్టుదలతో ఉన్నారు. కరోనా పేరుతో అప్పట్లో ఎన్నికలు వాయిదా వేసినందున.. ఆయన వెళ్లిపోయేవరకూ ఎన్నికలు వాయిదా కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టుంది సర్కారు. దీంతో ఈ విషయం ఓ కొలిక్కి రావట్లేదు.
Also Read: అమరావతి ఉద్యమం.. రైతుల చూపు ఆయనవైపే
ప్రభుత్వం తాజా ఎత్తు..
ఎన్నికల కమిషనర్, ప్రభుత్వం నడుమ లేఖల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం మరోసారి ఎస్ఈసీ నిమ్మగడ్డ సీఎస్ కు లేఖ రాశారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా.. ఏపీ సర్కార్‌కు వైద్య నిపుణులు ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం… జనవరితో మొదలై మార్చి వరకూ కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని, అందువల్ల.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో.. వైద్య నిపుణులు ఇచ్చిన ఈ నివేదికనే ఎన్నికల కమిషనర్ కు ప్రభుత్వం పంపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: అన్నదాతకు సాయమేదీ? ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోరా?
ఎన్నికల ప్రక్రియలో కమిషనర్..
స్థానిక ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేయడంతో.. ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ మరింత చురుగ్గా ప్రారంభించారు. ఓటర్ల జాబితాను ఫైనల్ చేసే కసరత్తు కూడా ప్రారంభించారు. మరి, ప్రభుత్వం తాజా నివేదికను పంపితే నిమ్మగడ్డ ఏం చేస్తారు? సర్కారుకు ఇంకో ఉత్తరం రాస్తారా? మరో నిర్ణయం ఏమైనా తీసుకుంటారా..? అన్నది చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్