https://oktelugu.com/

పుష్ప కోసం రంగస్థలం టెక్నిక్

కరోనా వైరస్ కారణంగా దర్శకుడు సుకుమార్ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. కేరళలో మొదటి షెడ్యూల్ షూట్ చేసిన సుకుమార్, నెక్స్ట్ షెడ్యూల్ కూడా అక్కడే ప్లాన్ చేశాడు. మరికొన్ని రోజులలో కేరళ వెళ్లనున్నారనగా… దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చింది. దీనితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం జరిగింది. ఏడు నెలలకు పైగా సాగిన లాక్ డౌన్ నిబంధనలకు ఈ మధ్యనే సడలింపులు ఇవ్వడంతో షూటింగ్స్ మొదలయ్యాయి. ఈ మధ్యనే అటవీ ప్రాంతంలో పుష్ప షూటింగ్ మొదలుపెట్టాడు సుకుమార్. […]

Written By:
  • admin
  • , Updated On : December 13, 2020 / 01:45 PM IST
    Follow us on


    కరోనా వైరస్ కారణంగా దర్శకుడు సుకుమార్ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. కేరళలో మొదటి షెడ్యూల్ షూట్ చేసిన సుకుమార్, నెక్స్ట్ షెడ్యూల్ కూడా అక్కడే ప్లాన్ చేశాడు. మరికొన్ని రోజులలో కేరళ వెళ్లనున్నారనగా… దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చింది. దీనితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం జరిగింది. ఏడు నెలలకు పైగా సాగిన లాక్ డౌన్ నిబంధనలకు ఈ మధ్యనే సడలింపులు ఇవ్వడంతో షూటింగ్స్ మొదలయ్యాయి. ఈ మధ్యనే అటవీ ప్రాంతంలో పుష్ప షూటింగ్ మొదలుపెట్టాడు సుకుమార్.

    Also Read: నారప్పగా వెంకీ అదరగొట్టాడు !

    ఈ నేపథ్యంలో పుష్ప కోసం సుకుమార్ రంగస్థలం పద్ధతి ఫాలో అవనున్నాడట. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం షూటింగ్ ని చాలా వరకు హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. పీరియడ్ మూవీ కావడంతో హైదరాబాద్ లో ప్రత్యేకమైన విలేజ్ సెట్ వేసి సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పొలాచ్చిలో జరిగింది. ఇక గోదావరి నదితో అనుసంధానమైన సన్నివేశాలు మాత్రం గోదావరి జిల్లాలలో చిత్రీకరించారు. విజువల్ గా అద్భుతం అనిపించిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అందుకుంది.

    Also Read: నిహారికను అలా చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాగబాబు

    కాగా పుష్ప షూటింగ్ కూడా వీలైనంత వరకు సుకుమార్ సెట్స్ లో చిత్రీకరణ జరపాలని భావిస్తున్నారట. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఈ కీలక సన్నివేశాలు హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరిస్తారని సమాచారం. స్మగ్లింగ్ సన్నివేశాలు దట్టమైన నల్లమల ఫారెస్ట్ లో చిత్రీకరించే అవకాశము కలదు. ఇప్పటికే చిత్రీకరణ ఆలస్యం అయిన నేపథ్యంలో త్వరగా మూవీ పూర్తి చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్