43 శాతం అడిగారు.. 7.5శాతం ఫిట్ మెంట్ ఉద్యోగుల చేతిలో పెట్టిన కేసీఆర్

శరామామూలే.. తెలంగాణ ఏర్పాడ్డాక ఆదిలో మురిపించి అనంతరం అస్సలు పట్టించుకోకుండా పోయిన తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వారు ఓటు బ్యాంకు కాకపోవడం.. వారి ఓట్లు పెద్దగా లేకపోవడంతో కేసీఆర్ ఉద్యోగులపై శీతకన్ను వేశారు. పీఆర్సీ, ఫిట్ మెంట్, హెచ్ఆర్సీ, ఐఆర్ లాంటి వాటి కోసం కళ్లు కాయలు కాసి పండ్లు అవుతున్నా ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ఇటీవల వరుస ఎన్నికల్లో ఓడిపోవడం.. ఉద్యోగుల వ్యతిరేకత బయటపడడంతో కేసీఆర్ వారిని […]

Written By: NARESH, Updated On : January 27, 2021 5:00 pm
Follow us on

శరామామూలే.. తెలంగాణ ఏర్పాడ్డాక ఆదిలో మురిపించి అనంతరం అస్సలు పట్టించుకోకుండా పోయిన తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వారు ఓటు బ్యాంకు కాకపోవడం.. వారి ఓట్లు పెద్దగా లేకపోవడంతో కేసీఆర్ ఉద్యోగులపై శీతకన్ను వేశారు. పీఆర్సీ, ఫిట్ మెంట్, హెచ్ఆర్సీ, ఐఆర్ లాంటి వాటి కోసం కళ్లు కాయలు కాసి పండ్లు అవుతున్నా ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ఇటీవల వరుస ఎన్నికల్లో ఓడిపోవడం.. ఉద్యోగుల వ్యతిరేకత బయటపడడంతో కేసీఆర్ వారిని ఆయింట్ మెంట్ పూసే పనిలో పడ్డారు.

సడెన్ గా ఉద్యోగుల పీఆర్సీపై కమిటీ నివేదికతో కదలిక తీసుకొచ్చారు. ఇప్పటికే ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ 2018 ఎన్నికల వేళ హామీనిచ్చిన కేసీఆర్.. తెలంగాణ నిరుద్యోగులకు హ్యాండ్ ఇచ్చారు. సన్నబియ్యం పండించాలని అటు రైతులను ఆగం చేశారు. ఇప్పుడు ఉద్యోగులను కూడా అదే పనిచేశాడని తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులను మూడేల్లుగా ఊరించి ఇప్పుడు ఊసురుమనిపించాడని మండిపడ్డారు. ఉద్యోగులు కోరినట్లు 43శాతం ఫిట్ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ కేవలం 7.5 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని.. దీనికి మూడేల్ల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఫిట్ మెంట్ 7.5శాతం ఇచ్చి హెచ్ఆర్ఏ 6శాతం తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. రోజురోజుకు ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్ఆర్ఏను తగ్గించాలనుకుంటారా? అని నిలదీశారు.

కేసీఆర్ కోరినట్టే సీఆర్ బిశ్వాల్ పీఆర్సీని రాశారని.. కమిటీపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చేది ఇదేనా అన్న ఆవేదన ఆ ఉద్యోగుల్లో నెలకొంది. ఇంత తక్కువ ఫిట్ మెంట్ ను ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇవ్వలేదని సంజయ్ ఆరోపించారు.