https://oktelugu.com/

‘అంధధున్’ రీమేక్ లో వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్

బాలీవుడ్ మూవీ ‘అంధధున్’… థ్రిల్లర్ జోనర్ లో ఉండే అసలైన మజాని ప్రేక్షకులకి పరిచయం చేసి 2018 లో విడుదలైన ఇండియన్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో ప్లాట్, ట్విస్ట్ లు ఒక హాలీవుడ్ మూవీ ని చూస్తున్నట్లుగా అనిపిస్తాయి. ఈ సినిమాలో దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ప్రతిభ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే చెప్పుకోవాలి. ఈ మూవీని ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషలలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ లో […]

Written By:
  • admin
  • , Updated On : January 27, 2021 / 04:47 PM IST
    Follow us on


    బాలీవుడ్ మూవీ ‘అంధధున్’… థ్రిల్లర్ జోనర్ లో ఉండే అసలైన మజాని ప్రేక్షకులకి పరిచయం చేసి 2018 లో విడుదలైన ఇండియన్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో ప్లాట్, ట్విస్ట్ లు ఒక హాలీవుడ్ మూవీ ని చూస్తున్నట్లుగా అనిపిస్తాయి. ఈ సినిమాలో దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ప్రతిభ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే చెప్పుకోవాలి. ఈ మూవీని ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషలలో రీమేక్ చేస్తున్నారు.

    తెలుగు వెర్షన్ లో నితిన్, న‌భా న‌టేష్‌, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించనుండగా మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌ర‌గుతోంది. ఇక మలయాళంలో సూపర్ స్టార్ పృథ్వీరాజ్ ప్రధాన పాత్ర‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. హిందీలో ట‌బు పాత్ర‌లో మ‌మ‌తా మోహ‌న్‌ దాస్, రాధికా ఆప్టే చేసిన పాత్ర‌లో రాశి ఖ‌న్నా క‌నిపించ‌బోతున్నారు. మలయాళ వెర్షన్ ని ‘బ్ర‌మ‌మ్’ అనే టైటిల్ తో ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ ర‌వి కే చంద్ర‌న్ డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

    గ‌త ఏడాది వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాశీ ఖన్నాకు నిరాశే ఎదురైంది. అప్పటి నుండి ఇప్పటివరకు అమ్మడుకి మ‌రో తెలుగు సినిమా అవకాశం లభించలేదు. కానీ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.