కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగం పోయింది.. ఏం జరిగిందంటే..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మొదట హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా మార్చి నెల నుంచి వృద్ధులకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరగనుంది. అయితే కరోనా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది త్వరగా వ్యాక్సిన్ ను వేయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు దొరికిపోయి ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన ఒక వ్యక్తి బిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవోగా పని చేస్తున్నారు. […]

Written By: Kusuma Aggunna, Updated On : January 27, 2021 5:23 pm
Follow us on

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మొదట హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా మార్చి నెల నుంచి వృద్ధులకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరగనుంది. అయితే కరోనా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది త్వరగా వ్యాక్సిన్ ను వేయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు దొరికిపోయి ఇబ్బందులు పడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన ఒక వ్యక్తి బిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవోగా పని చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు రాడ్ బేకర్ కాగా ఆ వ్యక్తి త్వరగా కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఐడెంటిటీ మార్చుకున్న ఆ వ్యక్తి ఆ విషయం అందరికీ తెలియడంతో విమర్శలను ఎదుర్కోవడంతో పాటు ఉద్యోగాన్ని కోల్పోయాడు. కెనడాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా వ్యాక్సిన్ నుంచి రక్షణ పొందాలని రాడ్ బేకర్ జనాభా తక్కువగా ఉన్న ఒక కుగ్రామానికి భార్యతో కలిసి వెళ్లాడు.

ఆ గ్రామ జనాభా 150 కాగా హోటల్ కార్మికుడినని చెప్పి ఆ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నాడు. అయితే అక్కడి స్థానిక అధికారులు రాడ్ బేకర్ అబద్ధం చెప్పాడని.. వ్యాక్సిన్ కోసం ఐడెంటిటీని మార్చుకున్నాడని గుర్తించారు. అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా వ్యాక్సిన్ కోసమే ఈ విధంగా చేశామని రాడ్ బేకర్ దంపతులు అంగీకరించారు. ఈ విషయం మీడియాకు లీక్ కావడంతో రాడ్ బేకర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

కెనెడియన్ క్యాసినో సంస్థకు సీఈఓగా పని చేస్తున్న రాడ్ బేకర్ పై యుకాన్ కమ్యూనిటీ సర్వీసెస్ మంత్రి జాన్ స్ట్రైకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాడ్ బేకర్ దంపతులకు భారీ జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.