తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ‘కాళేశ్వరం’ ప్రాజెక్ట్. నీళ్లు, నిధుల విషయంలో తెలంగాణ ప్రజలను సంతృప్తి పరిచి గద్దెనెక్కారు.
Also Read: అఖిలప్రియ విడుదల.. కానీ ట్విస్ట్ ఇదే
అయితే ఉత్తర తెలంగాణ ప్రజల తాగు, సాగు నీటి కష్టాలు తీర్చిన ఇప్పుడు దక్షిణ తెలంగాణపై పడ్డారు. అక్కడ వ్యతిరేకత రూపుమాపడానికి పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించారు.
తాజాగా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్ పనులపై సమీక్షించారు. వచ్చే ఏడాదిలోగా పాలమూరు ప్రాజెక్ట్ ను.. వచ్చే ఆరు నెలల్లోగా డిండి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని తెలిపారు.
బిల్లల చెల్లింపుల కోసం తక్షణమే రూ.2వేల కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం అందించి భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
Also Read: సుప్రీంకోర్టే ఇక కీరోల్.. ఏపీలో ఎన్నికలు ఏం కానున్నాయి?
నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు .. జూరాలలో మరో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి అయితే మహబూబ్ నగర్ సస్యశ్యామలం అవుతుందన్నారు. డిండి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి నల్గొండ ఫ్లోరైడ్ ను తరిమికొడుతామని చెప్పారు.
మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇక్కడ ప్రజల మనసులు చూరగొన్న కేసీఆర్ ఇప్పుడు దక్షిణ తెలంగాణపై ఫోకస్ చేసి వారి కరువు తీర్చేలా ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్