జోబైడెన్ సంచలనం: ప్రతి అమెరికన్ కు లక్షన్నర

అమెరికా ప్రచారం సమస్యలపైనే జరుగుతోంది.కానీ పైసల మీద జరగదు.. కానీ అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ గద్దెనెక్కగానే అమెరికన్లకు గొప్ప ఊరటనిచ్చాడు. కరోనా లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయి కష్టాలు పడుతున్న అమెరికన్లకు ఆర్థిక సాయం ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. Also Read: దేశానికి 4 రాజధానులు.. బాంబు పేల్చిన బెంగాల్ సీఎం జోబైడెన్ నగదు బదిలీ చేస్తానని ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వలేదు.కానీ పదవి చేపట్టగానే ప్రజలందరినీ ఆదుకోవడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ […]

Written By: NARESH, Updated On : January 24, 2021 10:09 am
Follow us on

అమెరికా ప్రచారం సమస్యలపైనే జరుగుతోంది.కానీ పైసల మీద జరగదు.. కానీ అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ గద్దెనెక్కగానే అమెరికన్లకు గొప్ప ఊరటనిచ్చాడు. కరోనా లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయి కష్టాలు పడుతున్న అమెరికన్లకు ఆర్థిక సాయం ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

Also Read: దేశానికి 4 రాజధానులు.. బాంబు పేల్చిన బెంగాల్ సీఎం

జోబైడెన్ నగదు బదిలీ చేస్తానని ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వలేదు.కానీ పదవి చేపట్టగానే ప్రజలందరినీ ఆదుకోవడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ పెద్ద ప్యాకేజీకి ఆమోదం తెలిపారు.

జోబైడెన్ ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం.. ప్రతి అమెరికా పౌరుడి అకౌంట్ కు రెండు వేల డాలర్లు జమ అవుతాయి. అంటే మన రూపాయిల్లో లక్షన్నర డబ్బులు వేస్తున్నారన్నమాట..

Also Read: అంపశయ్యపై మరో కురువృద్ధ నేత

అమెరికా రెస్క్యూ ప్లాన్ పేరుతో లక్షా 90వేల డాలర్ల ప్యాకేజీని జోబైడెన్ తాజాగా ప్రకటించారు. ఆర్థికంగా కృంగిపోయిన ఇతర రంగాలకు కూడా పెద్ద ఎత్తున ప్యాకేజీలు ప్రకటించడానికి రెడీ అయ్యారు.

అమెరికాలో ప్యాకేజీ అంటే నేరుగా నగదు బదిలీనే.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి.. వ్యాపారాల్లో నష్టపోయిన వారికీ ఇలా అందరికీ ఉద్దీపన ప్యాకేజీల కింద బ్యాంకు అకౌంట్ల ద్వారా డబ్బులు అందిస్తారు. ట్రంప్ అందించిన రూ.66 లక్షల కోట్ల ప్యాకేజీకి అదనంగా జోబైడెన్ ఇప్పుడు అమెరికన్ ప్రజలందరికీ ఈ ప్యాకేజీ ప్రకటించారు. ఈ పరిణామం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా ఉంది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు