https://oktelugu.com/

కేజీఎఫ్2కు హీరో యష్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

కేజీఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్2’. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై రికార్డులు సృష్టించింది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్ వ్యూస్ లు దాటిపోయింది. కోటి వ్యూస్ ను అతి తక్కువలో అందుకోవడం అంటే అది దేశ సినిమా చరిత్రలోనే ఓ సంచలనమనే చెప్పొచ్చు. ఏకంగా 5 మిలియన్లకు పైగా లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం. Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2021 / 09:33 PM IST
    Follow us on

    కేజీఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్2’. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై రికార్డులు సృష్టించింది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్ వ్యూస్ లు దాటిపోయింది. కోటి వ్యూస్ ను అతి తక్కువలో అందుకోవడం అంటే అది దేశ సినిమా చరిత్రలోనే ఓ సంచలనమనే చెప్పొచ్చు. ఏకంగా 5 మిలియన్లకు పైగా లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం.

    Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు నాగ్ అశ్విన్ సర్ప్రైజ్.. అది ఏంటంటే?

    చాప్టర్ 1లో మిగిలిన కథను చాప్టర్ 2లో చూపించబోతున్నారు. గరుడను చంపిన రాకీ ఆ తర్వాత కేజీఎఫ్ ను ఎలా సొంతం చేసుకున్నాడు.. శత్రువుల దాడిని ఎలా ఎదుర్కొన్నాడు? అధీర ఎలా తిరిగొచ్చాడు? భారత ప్రభుత్వం కేజీఎఫ్ ను ఎలా దక్కించుకుందనేది రెండో పార్ట్ లో చూపించబోతున్నారు.

    ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా బడ్జెట్ , కొన్ని సీన్లకు భారీగా ఖర్చు అయ్యిందని లెక్కలు బయటకొచ్చాయి. అవి అందరినీ షాక్ కు గురిచేశాయి.

    Also Read: ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ఝలక్.. రిలీజ్ డేట్ లీక్..?

    ఈ సినిమా హీరో యష్ కు ఏకంగా రెమ్యూనరేషన్ గా 30-35 కోట్ల వరకు కేజీఎఫ్2 నిర్మాణ సంస్థ హెంబలే ఇస్తున్నట్టు టాక్ బయటకు వచ్చింది. అంతేకాదు.. లాభాల్లో వాటాను కూడా ఆఫర్ చేస్తున్నారట.. ఒకవేళ ఈ సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే హీరో యష్ కు ఎంతలేదన్న 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ దక్కవచ్చని అంటున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్