రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. దుబ్బాక.. గ్రేటర్లో కారు స్పీడుకు కమలదళం బ్రేక్ వేయడంతో సీఎం కేసీఆర్ బీజేపీపై కన్నెర్ర చేశారు. కేంద్రంలోని బీజేపీపై పోరుకు భారత్ బంద్ సాక్షిగా శ్రీకారం చుట్టారు. అయితే ఉన్నట్లుండి ఆయన ఢిల్లీ టూరుకు వెళుతుండటం వెనుక మర్మమెంటోననే ఆసక్తి నెలకొంది.
Also Read: ‘జమిలి’కి సై అంటున్న కేంద్రం.. 2022లో దేశవ్యాప్త ఎన్నికలు?
సీఎం కేసీఆర్ నేడు హస్తినకు వెళ్లనున్నారు. అక్కడే మూడురోజులపాటు మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ సీఎంవో ప్రధాని అపాయింట్మెంట్ కోరిడం కేసీఆర్ రాజకీయ వ్యూహాంలో భాగమనే తెలుస్తోంది. ఇక టూరులో సీఎం కేసీఆర్ ప్రధాని కలుస్తారా? లేదా అనేది ఆసక్తిని రేపుతోంది.
సీఎం ఢిల్లీ టూరులో భాగంగా కేసీఆర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పలు కేంద్ర మంత్రులను.. విపక్ష నాయకులతో భేటి కానున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేసేందుకు ఢిల్లీ వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం..! ఏర్పాట్లు రెడీ చేస్తున్న అధికారులు..
ఇక ఢిల్లీలో కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సీఎం కేసీఆర్ స్వయంగా మద్దతు తెలుపుతారనే టాక్ విన్పిస్తోంది. ఈమేరకు కేసీఆర్ రైతు సంఘాల నాయకులతో భేటి కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ ముందుగా రైతు సంఘాలతో మాట్లాడితే మాత్రం కేంద్రాన్ని ఢీకొట్టే సంకేతాలు వెళ్లడం ఖాయంగా కన్పిస్తోంది.
ఈ టూర్లో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారనే టాక్ విన్పిస్తోంది. ఒకవేళ ప్రధాని అపాయింట్ ఇస్తే మాత్రం ఆయనతో భేటి అయ్యే అవకాశాలు కన్పిస్తున్నారు. ఏదిఏమైనా కేసీఆర్ సడన్ గా ఢిల్లీ వెళ్లనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్