https://oktelugu.com/

డిసెంబర్ 31.. జబర్దస్త్ వర్సెస్ ఢీ..!

కామెడీ ప్రధానంగా సాగే జబర్దస్త్ ప్రొగ్రాం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుంది. అలాగే డ్యాన్స్ తో ఆకట్టుకునే ఢీ కార్యక్రమం కూడా టాప్ షో ల లిస్టులో ఉంది. అయితే ఈ రెండు ఈటీవీలోనే ప్రసారమవుతున్నారెండు ప్రొగ్రాంలలోని నటుల మధ్య కొట్లాట సాగుతోంది..! డిసెంబర్ 31 నైట్ జరిగే వేదిక కోసం రెండు కార్యక్రమాల నటులు తమకంటే తమకే కావాలని పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా యాంకర్ ప్రదీప్ పై అదిరే అబి ఫైర్ అయిన వీడియో వైరల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2020 / 01:28 PM IST
    Follow us on

    కామెడీ ప్రధానంగా సాగే జబర్దస్త్ ప్రొగ్రాం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుంది. అలాగే డ్యాన్స్ తో ఆకట్టుకునే ఢీ కార్యక్రమం కూడా టాప్ షో ల లిస్టులో ఉంది. అయితే ఈ రెండు ఈటీవీలోనే ప్రసారమవుతున్నారెండు ప్రొగ్రాంలలోని నటుల మధ్య కొట్లాట సాగుతోంది..! డిసెంబర్ 31 నైట్ జరిగే వేదిక కోసం రెండు కార్యక్రమాల నటులు తమకంటే తమకే కావాలని పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా యాంకర్ ప్రదీప్ పై అదిరే అబి ఫైర్ అయిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ వీరిద్దరి మధ్య జరిగిన వైరం ఎంటనే చర్చ సాగుతోంది.

    Also Read: నిహారిక పెళ్లికి పవన్ భార్య ఎందుకు వెళ్ళలేదంటే..?

    ప్రతీ డిసెంబర్ 31న ఢీ, జబర్దస్త్ షోలు నువ్వా నేనా అన్నట్లు సాగుతాయి. నాగబాబు జబర్దస్త్ లో ఉన్న సమయంలో ఢీ మాస్టర్ తరుణ్ తో పోటీ పడేవారు. ఈసారి డిసెంబర్ 31న ఢీ డ్యాన్సర్లను జబర్దస్త్ కమెడియన్లు కిడ్నాప్ చేశారు. ఢీ డ్యాన్స్ స్టేజీ తమకు కావాలంటూ అదిరే అబి బ్యాచ్ స్టేజీ మీదకు వచ్చి యాంకర్ ప్రదీప్ తో గొడవ పడుతుంటాడు… ఆ రోజు జరిగే ప్రొగ్రాం కోసం తీసిన ప్రోమో ఇప్పడు వైరల్ అవుతోంది.

    ఢీ డ్యాన్సర్లను కిడ్నాప్ చేసి బంధించాము.. మాకు స్టేజీ కావాలి.. వచ్చే గురువారం వరకు ఈ స్టేజీ మాదే అని అదిరే అబి బ్యాచ్ శేకర్ మాస్టర్ కు వార్నింగ్ ఇచ్చారు. అయితే శేఖర్ మాస్టర్ రిక్వెస్ట్ చేసినా అబి బ్యాచ్ ఆగడం లేదు. దీంతో బాబా మాస్టర్ కలగజేసుకొని మా డ్యాన్సర్లను విడిచిపెట్టకపోతే మీ అంతు చూస్తాం అని అంటున్నాడు.

    Also Read: ఇత‌మ‌న్నా, మెహ‌రీన్‌ మళ్లీ ఓ రేంజ్ లో కుమ్మేస్తారట !

    దిలా ఉండగా కాంట్రవర్సీకి వేదికగా జబర్దస్త్ ప్రొగ్రాం తయారవగా ఇప్పడు ఢీ కార్యక్రమం కూడా అదే స్థాయిలో వెళుతోంది. ఇటీవల ఎలిమినేషన్స్ విషయంలో శేఖర్ మాస్టర్ రాజకీయాలు చేస్తున్నాడని స్టేజీ మీదనే అక్సాఖాన్ ఫైర్ అయింది. దీంతో శేఖర్ మాస్టర్ కూడా అందుకు ఘాటుగానే సమాధానమిచ్చారు. ఇక ఈ డిసెంబర్ 31న జబర్దస్త్, ఢీ ప్రొగ్రాం నటులు స్టేజీ మీద ఎలా అలరిస్తారో చూడాలి..

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్